2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే హైఓల్టేజ్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఎల్లుండి ఈ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ తో టీమిండియా.. వన్డే ప్రపంచకప్‌లో వరుసగా ఎనిమిదో విజయం కోసం ఎదురుచూస్తుంది.
వరల్డ్ కప్ 2023లో భాగంగా తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఇండియా తలపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫీల్డింగ్‌తో ‘బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ద డే’గా ఎంపికయ్యాడు. ఇప్పుడు శార్దూల్ ఠాకూర్ కు 'బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది డే' బిరుదు ఇచ్చింది. అయితే అందుకు సంబంధించి డ్రెస్సింగ్ రూమ్‌లో కింగ్ కోహ్లీ స్వయంగా తన చేతులతో శార్దూల్‌కు పతకాన్ని అందించాడు. శార్దూల్ అద్భుతమైన ఫీల్డింగ్ కారణంగా ఈ పతకం లభించింది.
వన్డే వరల్డ్ కప్-2023 లో భాగంగా ఈరోజు సౌతాఫ్రికా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ లక్నో వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ చరిత్ర సృష్టించాడు. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను బ్యాటింగ్ కు పంపింది. ఈ మ్యాచ్ లో డికాక్ మరో సెంచరీ బాదాడు.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఎల్లుండి భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్ వెళ్తున్నారా? అయితే... జాగ్రత్త. మీరు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌ని స్టేడియంలో వీక్షించాలంటే ఐఫోన్ కొన్న దానికంటే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండగే. ఈ కారణం చేత విమాన టిక్కెట్లు, హోటళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
వరల్డ్ కప్ 2023 ప్రారంభంకు ముందే టీమిండియా డాషింగ్ ఓపెనర్ శుభ్మాన్ గిల్ డెంగ్యూ బారిన పడ్డాడు. దీంతో జట్టు ఆడిన రెండు మ్యాచ్లకు అతను దూరమ్యాడు. అయితే అప్పటి నుంచి చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందగా.. తాజాగా కోలుకున్నాడు. దీంతో పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో ఆడనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం గిల్ నెట్స్ లో అడుగుపెట్టి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.
వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక సగటు పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా భారత కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు. వన్డే ప్రపంచకప్‌లో కనీసం 1,000 పరుగులు చేసిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ అత్యధిక బ్యాటింగ్ సగటును కలిగి ఉన్నాడు. సచిన్ టెండూల్కర్, వివ్ రిచర్డ్స్ వంటి దిగ్గజాలు కూడా రోహిత్ శర్మ తర్వాత జాబితాలో ఉన్నారు. వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్ 65.2 సగటుతో పరుగులు చేస్తున్నాడు.
నిన్న(బుధవారం) ఆఫ్ఘనిస్థాన్‌తో టీమిండియా అలవోకగా విజయం సాధించిన విషయం తెలిసిందే. అందులో టీమిండియా స్టార్ బౌలర్ 4 వికెట్లు తీసి ఆఫ్ఘాన్ స్కోరును కట్టడి చేయగా.. ఇక బ్యాటింగ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే తన బౌలింగ్ లో 4 వికెట్లు సాధించినా.. సంతోషంగా లేనని బుమ్రా చెప్పుకొచ్చాడు. అతను వేసిన 10 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి నలుగురు ఆటగాళ్లను ఔట్ చేశాడు.
2023 వరల్డ్ కప్ ప్రారంభం నుంచే టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ మ్యాచ్ లకు దూరమయ్యాడన్న సంగతి తెలిసిందే. డెంగ్యూ బారిన పడి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. తాజాగా మరొకరు డెంగ్యూ బారిన పడ్డాడు. భారతీయ ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే డెంగ్యూ బారిన పడ్డారు. అయితే అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌కు హర్ష దూరం కానున్నాడు.
అహ్మదాబాద్లోని ప్రధాని మోడీ స్టేడియంలో పాకిస్థాన్ జట్టు భారత్‌తో మ్యాచ్ ఆడటం కోసం ఇక్కడకు చేరుకున్నారు. పాకిస్తాన్ జట్టుకు స్వాగతం పలికేందుకు అమ్మాయిలు నృత్యం చేశారు. గుజరాతీ దుస్తులు ధరించిన అమ్మాయిలు పాకిస్థాన్ ఆటగాళ్లకు స్వాగతం పలుకుతూ కనిపించారు. అంతేకాకుండా వారిపై పూలవర్షం కురిపించారు. పాక్ ఆటగాళ్లకు ఘన స్వాగతం పలకడం టీమిండియా అభిమానులకు నచ్చలేదు.
ఇండియా- పాకిస్తాన్ మధ్య 2003 నుంచి మొదలుపెడితే 2019 వరకు జరిగిన వరల్డ్ కప్ లో ఇండియాదే పై చేయి అయింది. అయితే ఇప్పుడు జరిగే మ్యాచ్ కోసం ఇరుజట్లు గెలవాలనే ఆశతో ఉన్నాయి. చూడాలి మరీ 2023 వరల్డ్ కప్ లో ఈ ఇరుజట్ల మధ్య మ్యాచ్ ఎవరు గెలుస్తారో.