పెండింగ్ అభ్యర్థుల 5 స్థానాలను మూడు నాలుగు రోజుల్లో ప్రకటిస్తామని కేటీఆర్ చిట్ చాట్లో తెలిపారు. ఇప్పటికే ప్రకటించిన తమ అభ్యర్థులు ప్రజల్లో ఉన్నారని.. ప్రచారంలో దూసుకుపోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి 40 చోట్ల అభ్యర్థులు లేరని.. కానీ 70 స్థానాల్లో గెలుస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని పేర్కొన్నారు. అది చూసి ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు నవ్వుకుంటున్నారని విమర్శించారు.
తెలంగాణలో బదిలీ చేసిన స్థానాల్లో అధికారులను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీలు, సీపీలు, కలెక్టర్లను నియమిస్తూ లిస్ట్ పంపింది. అందులో హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్యాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక.. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శిగా సునీల్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్‌గా జ్యోతి బుద్ధ ప్రకాశ్, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌గా క్రిస్టినా పేర్లను ప్రకటించింది.
పసుపు సనాతన ధర్మం.. పసుపు బోర్డు తన రాజకీయ పునాది అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఉత్తరప్రదేశ్లో మూసిన చక్కర ఫ్యాక్టరీ తెరిపించిన ఘనత బీజేపీదేనన్నారు. ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ తాళలు తెరిపిస్తానని.. ఈ ప్రాంత రైతులకు మళ్ళీ పూర్వ వైభవం తెస్తానని తెలిపారు.
సెప్టెంబర్ 2023కి సంబంధించి 'ప్లేయర్ ఆఫ్ ది మంత్'ని ఐసీసీ ప్రకటించింది. ఈసారి శుభ్‌మాన్ గిల్‌ను ఈ నెల ఉత్తమ ఆటగాడిగా ఎంపిక చేశారు. సహచర ఆటగాడు మహ్మద్ సిరాజ్, ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలన్‌లను పక్కకు నెట్టి శుభ్‌మాన్ ఈ టైటిల్‌ను సాధించాడు.
2023 వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ చారిత్రాత్మక వికెట్ తీశాడు. తొలి ఓవర్ తొలి బంతికే బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ క్యాచ్ పట్టాడు. ఈ వికెట్‌తో ట్రెంట్ బౌల్ట్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన తొలి న్యూజిలాండ్ బౌలర్‌గా నిలిచాడు.
45 ఏళ్ల రాజకీయ జీవితం తనదని పొన్నాల అన్నారు. 45 ఏండ్ల తర్వాత ఈ చర్య బాధాకరంగా ఉందని తెలిపారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మీకు తెలియంది కాదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నందుకు గర్వంగా ఉందని పొన్నాల కంటతడి పెట్టారు. పేద కుటుంబం నుండి వచ్చి ఈ స్థాయికి వచ్చానని ఆయన తెలిపారు. వరుసగా మూడు సార్లు గెలిచిన బీసీ నేతను అయినా.. పార్టీలో అవమానం కలిగిందని చెప్పుకొచ్చారు.
రేపు(శనివారం) అహ్మదాబాద్‌లో భారత్-పాక్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచ కప్ 2023లో ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా ఉండబోతుంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్-పాకిస్థాన్ విజయం సాధించాయి. అయితే రేపటి మ్యాచ్‌లో వాతావరణం గురించి మాట్లాడితే మ్యాచ్‌పై ఎలాంటి ప్రభావం చూపదు. మ్యాచ్ సమయంలో వర్షం కురిసే అవకాశం లేదు.
ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. 134 పరుగుల భారీ తేడాతో సౌతాఫ్రికా గెలుపొందింది. 312 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 40.5 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బౌలర్ల దాటికి ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్స్ విఫలమయ్యారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు.. ఆరంభంలోనే ఓపెనర్లు పెవిలియన్ బాట పట్టారు.
2023వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఆశించినంత ప్రదర్శన చూపించడం లేదు. ఆడిన రెండు మ్యాచ్ ల్లో సింగిల్ డిజిట్ కే ఔటయ్యాడు. ఈ క్రమంలో బాబర్ ఆజం ఫామ్‌పై పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాబర్ ఆజం మరోసారి ఫ్లాప్ అయ్యాడని అన్నాడు. బాబర్ ఆజం విఫలమైనప్పటికీ.. మంచి ఫాంలో ఉన్న ఆటగాడు మరొకరు దొరికాడని తెలిపాడు.