హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం తప్పింది. కోటి నుండి పటాన్ చెరువు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. సరిగ్గా కేబీఆర్ పార్క్ వద్దకు రాగానే గమనించిన డ్రైవర్ చాకచక్యంగా.. ఎవరికి హాని కలగకుండా పార్క్ వైపు ఉన్న ఫుట్పాత్ పై బస్సును ఆపాడు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
చిక్కడపల్లిలో నిన్న ప్రవళిక అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పందించారు. ప్రవళిక సూసైడ్ చేసుకోవడం దారుణమన్నారు. ప్రవళిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి పరీక్షలు పోస్ట్ పోన్ అవుతున్నాయని.., మీరు నాకోసం ఎంతో కష్టపడ్డారని వాళ్ళ అమ్మ నాన్న తో ఫోన్ లో బాధపడిందని అన్నారు. ఆమె మృతికి నిరసనగా యువత మొత్తం వచ్చారని బండి సంజయ్ తెలిపారు. లక్ష్మణ్, భానుప్రకాష్ వాస్తవాలను తెలుసుకుందామని వెళ్తే.. వారిపై పోలీసులు లాఠీ…
మోడీ సర్కార్ రాకముందు దేశ వ్యాప్తంగా విద్యుత్ కొరత ఉండేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు వ్యవసాయ రంగానికి దేశంలో ఎక్కడ విద్యుత్ కోతలు లేవని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే రైతు పండించే ప్రతి పంటకు భీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు. జనవరి ఒకటి నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తాయని తెలిపారు. రైతు రాజ్యాన్ని తెలంగాణలో తీసుకొస్తాం... కేసీఆర్ లాగా ఎకరానికి కోటి రూపాయలు వస్తున్నాయని మభ్య పెట్టమన్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాల్ లో సీపీఐ పార్టీ జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పై చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. దేశంలో ఏ ఎన్నికల్లోనైనా వామపక్ష పార్టీలు ప్రజా ఎజెండాను అమలు చేస్తాయన్నారు.
వన్డే ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. బంగ్లాదేశ్ పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. చాలా కాలం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్‌తో కలిసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాదేశ్‌పై తన జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
క్రికెట్ అభిమానులకు ఇదొక గుడ్ న్యూస్. రేపు జరగబోయే ఇండియా-పాకిస్తాన్ కు మ్యాచ్ లో టీమిండియా యువ ఓపెనర్ ఆడనున్నాడు. ఈ విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ విలేకర్ల సమావేశంలో చెప్పాడు. శుభ్ మాన్ గిల్ 99 శాతం ఫిట్‌గా ఉన్నాడని చెప్పాడు. గిల్ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నాడని రోహిత్ శర్మ తెలిపాడు.
చంద్రబాబు భద్రతపై లోకేష్ చేసిన ట్వీట్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయం లోకేష్ ట్వీట్ చూసి బాధ అనిపించిందన్నారు. చంద్రబాబు భద్రత విషయంలో లోకేష్ వ్యక్తం చేసిన ఆందోళనను ఒక కొడుకుగా అర్థం చేసుకోగలనని తెలిపారు. లోకేష్ చెప్పింది వాస్తవం అయితే ఈ పరిస్థితి భాదకరమని కేటీఆర్ పేర్కొన్నారు. తనకు ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల నిజానిజాలు తెలియవు, కానీ ఆయన భద్రతకు ప్రమాదం అయితే రాజకీయల్లో ఇది దురదృష్టకరమని తెలిపారు.
ఇంగ్లండ్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ అలిస్టర్ కుక్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ పలికాడు. కొన్నాళ్ల పాటు ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్ గా, బ్యాట్స్ మెన్ గా తన సేవలు అందించాడు. 2018 సెప్టెంబర్ లోనే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్ పలికినప్పటికీ.. ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్‌లో ఆడాడు. ఇప్పుడు తన 38 ఏళ్ల వయస్సులో అన్ని రకాల ఫార్మట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ లవర్స్ కు పండగే. ఎందుకంటే ఈ జట్లు తలపడుతున్నప్పుడు చూడటమంటే ఆ కిక్కే వేరని అంటున్నారు. ఇప్పటికే రేపు జరగబోయే మ్యాచ్ కోసం అభిమానులు అహ్మదాబాద్ కు చేరుకున్నారు. డబ్బులు ఎంత ఖర్చైనా పర్వాలేదు.. కానీ స్టేడియంలో లైవ్ చూడాల్సిందేనంటూ ఎక్కడెక్కడి నుంచో అక్కడికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. ఇరు జట్లు ఆడిన రెండు మ్యాచ్ ల్లో గెలిచి మంచి ఊపు మీదున్నాయి. ఎలాగైనా ప్రత్యర్థి టీంను ఓడించాలనే కసితో ఇరు జట్లు చూస్తున్నాయి. అయితే పాక్ జట్టులో…
తెలంగాణ ప్రాంతం అనేక ఉగ్రవాదాల పీడిత ప్రాంతమని మురళీధర్ రావు అన్నారు. కేసీఆర్ ప్రకటించిన విధంగా బీఆర్ఎస్ జాతీయ పార్టీ అని తెలిపారు. అయితే బీఆర్ఎస్ ఇజ్రాయెల్, ఉగ్రవాదం పై ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.