2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే హైఓల్టేజ్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఎల్లుండి ఈ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ తో టీమిండియా.. వన్డే ప్రపంచకప్‌లో వరుసగా ఎనిమిదో విజయం కోసం ఎదురుచూస్తుంది. ఇదిలా ఉంటే.. ఇరు జట్ల నుండి కొన్ని రికార్డులు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
రికార్డుల పరంగా చూసుకుంటే భారత్ చాలా ముందుంది. వన్డే ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మొత్తం ఏడుసార్లు తలపడగా.. అందులో టీమిండియా ప్రతిసారీ విజయం సాధించింది. 1992లో వన్డే ప్రపంచకప్‌లో ఈ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత 1996, 1999, 2003, 2011, 2015, 2019 ప్రపంచకప్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. అయితే 2023 వరల్డ్ కప్ లో జరగబోయే ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లో అందరి దృష్టి ఈ ఆటగాళ్లపైనే ఉంటుంది. ఇంతకీ ఎవరెవరంటే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్, ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిదిపైనే ఉంటుంది.
Ratna Pathak Shah: కూతురు వయసున్న హీరోయిన్స్ తో రొమాన్స్.. వారికి సిగ్గు లేదు..
రోహిత్ శర్మ
అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫాంలోకి వచ్చాడు. 131 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2019 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై రోహిత్ శర్మ 140 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
విరాట్ కోహ్లీ
పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీకి మంచి పట్టు ఉంది. ఇటీవల జరిగిన ఆసియాకప్‌లో పాకిస్థాన్‌పై కోహ్లి సెంచరీ చేశాడు. ప్రపంచ కప్ 2023 మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 85 నాటౌట్, ఆఫ్ఘనిస్తాన్‌పై 55 నాటౌట్ ఇన్నింగ్స్‌లు ఆడాడు.
జస్ప్రీత్ బుమ్రా
భారత ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచకప్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 2 వికెట్లు, ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 4 వికెట్లు తీశాడు.
మహ్మద్ రిజ్వాన్
పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్.. శ్రీలంకపై 131 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు.
షాహీన్ అఫ్రిది
టోర్నీలో రెండు మ్యాచ్‌ల్లో పాక్ ఫాస్ట్ బౌలర్ ఇప్పటివరకు అత్యుత్తమ ప్రదర్శన చూపించలేకపోయాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ 1-1 వికెట్ మాత్రమే సాధించాడు. కానీ కొత్త బంతితో భారత్‌పై వికెట్లు తీయగలే సత్తా ఉంది.