ఈ ప్రపంచకప్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన తర్వాత మళ్లీ గెలుపొందలేదు. మొత్తం 6 మ్యాచ్ ల్లో రెండు గెలిచి, నాలుగు ఓడిపోయారు. ఇంకా పాకిస్తాన్ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు సెమీఫైనల్‌కు చేరుకోవాలన్న కల దాదాపుగా చెదిరిపోయినట్లే..
వరుస ఓటములతో కొంత నిరాశతో ఉన్న న్యూజిలాండ్ టీమ్ కు ఇదొక శుభవార్త అని చెప్పవచ్చు. నవంబర్ 1న సౌతాఫ్రికాతో జరుగనున్న కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు, రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టులోకి తిరిగి రానున్నట్లు సమాచారం.
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా గాయం కారణంగా ప్రపంచ కప్ మ్యాచ్ లకు దూరమయ్యాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆయన ఎడమ చీలమండలో గాయమైంది. దీంతో బెంగళూరులోని NCAలో చికిత్స తీసుకుని ప్రస్తుతం నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే.. హార్ధిక్ పాండ్యా త్వరలోనే తిరిగి జట్టులోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
టీమిండియా గెలుపుపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ .. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘లక్నో పిచ్ పై భారత్ అద్భుతమైన బ్యాటింగ్ చేసింది. ముఖ్యంగా వికెట్లు పడుతున్నా కూడా తన ఆటను కొనసాగించింది.
ప్రపంచకప్ 2023లో భాగంగా లక్నోలో జరిగిన ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 100 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులు చేయగా.. 230 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లకు భారత బౌలర్లు షాకిచ్చారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెటిలర్లు అనే పదం తాను వాడనని.. ఇక్కడే పుట్టిన బిడ్డగా నాకెంత హక్కు ఉందో ఇక్కడ వచ్చి నివసిస్తున్న ప్రతి ఒక్కరికి అంతే హక్కు ఉంటుందని అన్నారు. మెదక్ లో పుట్టి గజ్వేల్, కామారెడ్డి, సిరిసిల్లాకు వెళ్లిన పారాచుట్లు కల్వకుంట్ల కుటుంబమని దుయ్యబట్టారు.
విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. ఓవర్‌హెడ్ కేబుల్ తెగిపోవడంతో విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్ రైలు కంటకాపల్లి వద్ద నిలిచిపోయింది. సరిగ్గా అదే సమయంలో దాని వెనుకే అత్యంత వేగంగా వచ్చిన విశాఖ-పలాస ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాయగడ ప్యాసింజర్‌కు చెందిన నాలుగు భోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే సీటు దక్కకపోవడంతో ఆ పార్టీకి సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఇంటికి బీఆర్ఎస్ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ వెళ్లారు. అనంతరం నాగం జనార్ధన్ రెడ్డితో వారు సమావేశం అయ్యారు. నాగంను బీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించారు.
చంద్రబాబు, లోకేష్ పై వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కావలి పట్టణంలో ఒక బస్సు డ్రైవర్ ని కొంతమంది రౌడీ మూకలు కొట్టారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ఘటనకు పప్పు(లోకేశ్), దత్తపుత్రుడు (పవన్ కల్యాణ్) రాజకీయ రంగు పులిమారని ఆరోపించారు. ఆ రౌడీ ముఠాను ఎదిరించినందుకు తన కారు పై కూడా గతంలో దాడి చేశారని అన్నారు. రాష్ట్రంలో ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా ముఖ్యమంత్రికి ఆపాదిస్తుంటారని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ తెలిపారు.
సీఎం వైఎస్ జగన్ రేపు విజయవాడలో పర్యటించనున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నరేందర్ ప్రమాణం కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం జగన్ సాయంత్రం 4.47 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రాజ్‌భవన్ చేరుకోనున్నారు. అనంతరం కార్యక్రమానికి హాజరుకానున్నారు.