ఆసియా క్రీడల కాంస్య పతక విజేత, హైదరాబాద్ యువ అథ్లెట్ అగసర నందినికి హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సన్మానం చేశారు. ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో తెలంగాణకు తరఫున బరిలోకి దిగుతున్న నందినికి లక్ష రూపాయల చెక్‌ను నగదు ప్రోత్సాహకంగా అందించారు జగన్మోహన్ రావు.
అండర్ 19 మహిళల వరల్డ్ కప్ లో సత్తా చాటిన 12 మంది ఆటగాళ్లతో ఐసీసీ (ICC) టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ను ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి త్రిషతో పాటు కమలిని, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ చోటు దక్కించుకున్నారు.
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్‌కు భారీ దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ గాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో ఐదో టీ20లో సంజూ చూపుడు వేలికి గాయమైంది. జోఫ్రా ఆర్చర్ వేసిన బౌలింగ్‌లో బంతి సంజూ చూపుడు వేలుపై బలంగా తాకింది.
ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు.. సిక్సులతోనే డీల్ చేశాడు.
భారతీయ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగించే మసాలాల మిశ్రమాన్ని గరం మసాలా అంటుంటాం. ఈ మసాలాను వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ వంటకాల్లోనూ ఉపయోగిస్తారు. గరం మసాలాను దాల్చినచెక్క, లవంగాలు, ఏలకులు, నల్ల మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు. గరం మసాలా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
కొబ్బరి నీరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు.. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అలసట, నీరసాన్ని పోగొట్టడానికి రిఫ్రెష్ డ్రింక్ గా పని చేస్తుంది. ఇది.. సహజంగా తీపి, తాజా పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. కొబ్బరి నీటిలో విటమిన్లు, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి.. శరీరానికి బలాన్ని ఇస్తుంది. అంతేకాకుండా.. శరీరంలో నీటి లోపాన్ని తొలగించడానికి కొబ్బరి నీళ్లు అద్భుతంగా పనిచేస్తుంది. అయితే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని మీరు…
రిలయన్స్ జియో దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీలలో ఒకటి. 2024 జూలైలో జియో తన టారిఫ్‌లను పెంచినప్పటికీ, ఇప్పటికీ సరసమైన రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా తమ ప్లాన్ల ధరలను పెంచినా.. జియో యూజర్లకు అందించే కొన్ని ప్లాన్లు ఇంకా తక్కువ ధరలో మంచి సేవలను అందిస్తాయి.
ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి మంచి ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యం. బతువా చాలా తేలికగా లభించే ఆకుకూర. బతువా ఒక ఆయుర్వేద ఔషధ మొక్క.. ఇది ఎక్కువగా శీతాకాలంలో దొరుకుతుంది. ఈ ఆకుకూరలో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ ఎ, సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కీళ్లనొప్పులను తగ్గించడంలో.. ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.
ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) ఫిక్సింగ్ కలకలం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును కుదిపేసింది. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించగా.. స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని బీసీబీ (బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు) చూస్తోంది.