U-19 World Cup 2025: అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేత భారత్..
- అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేత భారత్
- వరుసగా రెండోసారి అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత్
- 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత జట్టు
- 11.2 ఓవర్లలోనే 83 పరుగుల టార్గెట్ రీచ్ అయిన బ్యాటర్లు
- బ్యాటింగ్, బౌలింగ్‌లో దుమ్మురేపిన భారత జట్టు
- సౌతాఫ్రికాను 82 పరుగులకే ఆలౌట్ చేసిన బౌలర్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచింది. వరుసగా రెండోసారి అండర్-19 వరల్డ్ కప్ గెలిచింది భారత్. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్లో 9 వికెట్ల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. 11.2 ఓవర్లలోనే 83 పరుగుల టార్గెట్‌ను భారత్ బ్యాటర్లు రీచ్ అయ్యారు. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ భారత జట్టు దుమ్మురేపింది. అండర్ 19 టీ20 ప్రపంచకప్ 2025 ఫైనల్ మ్యాచ్ భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. 82 పరుగులకే కుప్పకూలింది. అండర్-19 ప్రపంచకప్ ఛాంపియన్ కావాలన్న దక్షిణాఫ్రికా కలను భారత్ 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
Read Also: Sri Tej: శ్రీ తేజ్ ని పరామర్శించిన బన్నీ వాసు.. అవసరమైతే చికిత్స కోసం విదేశాలకు?
Also Read
- CM Chandrababu: ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు దంపతులు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
- CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
- IND vs WI 5th T20: అర్ష్‌దీప్ స్థానంలో భువీకి ఛాన్స్? ప్లేయింగ్ ఎలెవన్‌పై ఉత్కంఠ
- CJP protest: సీజేపీకి బిగ్ షాక్.. పోలీసుల అదుపులో అభిజిత్ దీప్కే
సౌతాఫ్రికా బ్యాటింగ్‌లో వాన్ వూరస్ట్ (23) అత్యధిక పరుగులు చేసింది. జెమా బోథా(16), ఫే కోవిలింగ్(15) పరుగులతో పర్వాలేదన్పించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. మరోవైపు.. బ్యాటింగ్, బౌలింగ్‌లో తెలుగమ్మాయి గొంగడి త్రిష అదరగొట్టింది. 32 బంతుల్లో 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది త్రిష. బౌలింగ్‌లోనూ మూడు వికెట్లతో రాణించింది త్రిష. భారత్ బౌలర్లలో వైష్ణవి శర్మ, అయూష్ శుక్లా, పరునికా సిసోడియా తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం.. 83 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 11.2 ఓవర్లలో సునాయసంగా చేధించింది. త్రిషతో పాటు సానికా చాల్కే(26*) కూడా రాణించింది. ఈ మొత్తం టోర్నీలో టీమిండియా అజేయంగా నిలిచింది. ఫైనల్‌తో సహా ఏడు జట్లపై వరుసగా విజయం సాధించింది.
Read Also: UP Crime: మరదలిపై గ్యాంగ్ రేప్, హత్య కోసం రూ.40,000 అప్పు.. సంచలనంగా యూపీ కేసు..
తాజావార్తలు
-
CM Chandrababu: ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు దంపతులు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
-
CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
-
OPPO Find X10 Pro Max: 200MP + 200MP + 200MP కెమెరాలతో ఒప్పో ఫైండ్ ఎక్స్10 సిరీస్.. భారత్‌లో లాంచ్ డేట్ ఫిక్స్
-
IND vs WI 5th T20: అర్ష్‌దీప్ స్థానంలో భువీకి ఛాన్స్? ప్లేయింగ్ ఎలెవన్‌పై ఉత్కంఠ
-
CJP protest: సీజేపీకి బిగ్ షాక్.. పోలీసుల అదుపులో అభిజిత్ దీప్కే
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!