తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది… ఈ క్రమంలో హైదరాబాద్ లో 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందని హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య అన్నారు. 2,400 మంది రౌడీ షీటర్స్ బైండోవర్ చేశామని సీపీ పేర్కొన్నారు. మరోవైపు.. 7 జోన్లలో 1600 మంది రౌడీ షీటర్స్ పై నిఘా పెట్టామని తెలిపారు. అంతేకాకుండా.. 2 లక్షలు వాహనాలు చెక్ చేశామని.. ఎన్నికల విధుల కోసం భారీగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు. మరోవైపు.. 45 వేల మంది రాష్ట్ర పోలీసులు, 3వేల మంది ఇతర శాఖల సిబ్బంది, 50 కంపెనీల స్పెషల్ పోలీసులతో బందోబస్త్ ఉంటుందని సీపీ సందీప్ శాండిల్య పేర్కొ్న్నారు.
Read Also: Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్.. బయటకు వచ్చిన 10 మంది కార్మికులు..
హైదరాబాదులో ఇప్పటివరకు 63 కోట్ల రూపాయల నగదు సీజ్ చేసామని సీపీ సందీప్ శాండిల్య అన్నారు. కేంద్ర రాష్ట్ర బలగాలతో భద్రత ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ఎవరైనా బెదిరింపులకు దౌర్జన్య పాల్పడితే వెంటనే చర్యలు తీసుకుంటామని అన్నారు. అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోకపోతే పోలీసు అధికారులపై చర్యలు ఉంటాయని చెప్పారు. చట్టాన్ని ఎవరైనా చేతుల్లోకి తీసుకుంటే తీవ్ర చర్యలు ఉంటాయని సీపీ పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఎన్నికల తాయిళాలు పంచితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Also: Andhrapradesh: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు