రాయ్‌పూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య 4వ టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే భారత్.. 2-1 ఆధిక్యంలో ముందుంది. అయితే ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని టీమిండియా ఆశిస్తోంది.
తెలంగాణలో గురువారం ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ఎల్లుండి (ఆదివారం) జరగనుంది. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
నాగార్జున సాగర్ జలాల విడుదల వివాదం ముగిసింది. నవంబర్ 28కి ముందు ఉన్న పరిస్థితిని కొనసాగిస్తూ.. ఈ డ్యామ్ నిర్వహణను కృష్ణ వాటర్ మేనేజ్మెంట్ కు అప్పగించడంతోపాటు సీఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణకు అప్పగించాలన్న కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి ప్రతిపాదనలకు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అంగీకరించాయి. నాగార్జున సాగర్ డ్యామ్ నుండి నవంబర్ 29న ఆంధ్రప్రదేశ్ ఏకపక్షంగా సాయుధ దళాలను మోహరించి.. కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేసిన సందర్భంగా వివాదం తలెత్తింది.
టీ20 క్రికెట్‌లో ఈరోజు టీమిండియా ఓ రికార్డు నెలకొల్పే సమయం వచ్చింది. ఈరోజు జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలిస్తే.. అత్యధిక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు గెలిచిన రేసులో పాకిస్తాన్‌ను వెనక్కి నెడుతుంది. ప్రస్తుతం ఇండియా-పాకిస్తాన్ సంయుక్తంగా మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్, పాకిస్తాన్‌లు 135-135 మ్యాచ్ ల్లో గెలుపొందాయి. ఈ క్రమంలో భారత్ పాకిస్తాన్ ను దాటి ముందడుగు వేసేందుకు ఈరోజు మంచి అవకాశం ఉంది. ఇప్పటి వరకు 226 టీ20 మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్ 135 విజయాలను నమోదు…
వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టడంపై మిచెల్ మార్ష్ స్పందించాడు. "నేను వరల్డ్ కప్ ను అగౌరవపర్చాలన్న ఉద్దేశంతో అలా చేయలేదని అన్నాడు. కావాలంటే వరల్డ్ కప్ ట్రోఫీపై మళ్లీ కాళ్లు పెడతానని చెప్పుకొచ్చాడు. అందులో ఎలాంటి సందేహం లేదన్నాడు. ఆ రోజున జరిగిన ఘటనపై నేనేమీ పెద్దగా ఆలోచించలేదు". అని మార్ష్ తెలిపాడు. ఈ విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తనకు ఇతరుల ద్వారా తెలిసిందన్నాడు.
ఏపీ ప్రభుత్వానికి కేఆర్‌ఎంబీ లేఖ రాసింది. వెంటనే సాగర్ ఉద్రిక్తతకు తెరదించాలని లేఖలో విజ్ఞప్తి చేసింది. సాగర్ డ్యామ్ నుంచి నీటి విడుదల విషయంలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.. అయితే వెంటనే నీరు తీసుకోవడం ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని కేఆర్ఎంబీ ఆదేశించింది. ఏపీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం తమకు పిర్యాదు చేసిందని కేఆర్ఎంబీ లేఖలో పేర్కొంది. ఏపీ సాగు నీరు కావాలని తమను కోరలేదని లేఖలో కేఆర్‌ఎంబీ స్పష్టం చేసింది.
హనుమకొండ జిల్లా కాజీపేటలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన బైక్ ఎక్కుతున్న ఓ మహిళని అతి వేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. అప్పుడే కాజీపేట సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ నుండి బయటికి వచ్చి బైక్ ఎక్కుతున్న క్రమంలో కవిత అనే మహిళను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తెలంగాణ పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఉన్న అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా గుర్తించారు. కాగా.. ఈ ప్రమాదంలో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోని ఫైల్స్, ఫర్నిచర్, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి.
రాత్రి 11 గంటల వరకు పోలింగ్ నడిచిందని సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. పోలింగ్ నడుస్తున్న సమయంలో ఎగ్జిట్ పోల్స్ కు ఎన్నికల కమీషన్ ఎలా అనుమతించారు..? అని ప్రశ్నించారు. సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా సాయంత్రం 5 గంటలు దాటిన తరువాత 30 వేలకు పైగా ఓట్లు పోల్ అయ్యాయని పేర్కొన్నారు. అలాంటప్పుడు ఎగ్జిట్ పోల్ ఎలా సరైందని విమర్శించారు. నూటికి నూరు శాతం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు.. సత్తుపల్లిలో నాల్గోసారి విజయం సాధిస్తున్నట్లు ధీమా వ్యక్తం చేశారు.
నాగార్జున సాగర్ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సాగర్ నీటి కోసం ఏపీ, తెలంగాణ పోలీసుల వివాదం తారాస్థాయి చేరుతున్నాయి. ఏపీ పోలీసులపై నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసుల ఫిర్యాదు మేరకు విజయపురి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా.. ఏపీ పోలీసులపై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీలో అంశాలు ఏమున్నాయంటే..