తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనేనని బండ్ల గణేష్ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్ కంటే ముందే తాను చెప్పానని.. వచ్చేది కాంగ్రెస్ అని తెలిపారు. దారిన పోయే వాళ్లలో అందరిని అడగండి.. ఎవరు సీఎం అని అంటే వాళ్ళను సీఎం చేయండని అన్నారు. డిసెంబర్ 3 నుండి పండగ ప్రారంభమవుతుందని బండ్ల గణేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో.. 76 నుండి 86 వరకు సీట్లు వస్తాయని తెలిపారు.
మధ్యప్రదేశ్‌లోని గుణ రైల్వే స్టేషన్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకోవడానికి రైల్వే పట్టాలపై వచ్చి పడుకున్నాడు కానీ.. అదృష్టవశాత్తూ రైలు అతనిపై నుండి వెళ్ళిన బతికి బట్ట కట్టాడు. ఆ వృద్ధుడికి ఒక్క చిన్న గాయం కూడా రాలేదు. ఈ ఘటన గురువారం గుణ రైల్వే స్టేషన్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. 70 ఏళ్ల వృద్ధుడు రైలు పట్టాల మధ్యలో పడుకున్నాడు. ఇంతలో గూడ్స్ రైలు ఆ పట్టాల మీద నుండి వెళ్లిపోయింది.
బీఆర్ఎస్ నేత దాసోజ్ శ్రవణ్ తమ పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ముమ్మాటికీ 70 సీట్లకు పైగా బీఆర్ఎస్ గెలుస్తుందని దాసోజు శ్రవణ్ అన్నారు. మూడవ సారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. తెలంగాణ ప్రజలతో కేసీఆర్ ది పేగు బంధం అని పేర్కొ్న్నారు. ఎగ్జిట్ పోల్ కు ఎగ్జాక్ట్ పోల్స్ కు మధ్య చాలా తేడా ఉంటుందని ఆరోపించారు. కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నాడని చెప్పారు. కాంగ్రెస్ నేతలు లేకి తనం చూపిస్తున్నారు.. చిల్లర ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో అగ్రనేత రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 కి జూమ్ మీటింగ్ లో రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. రేపు తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలవడనున్న నేపథ్యంలో.. ఈ భేటీకి ప్రాధన్యత సంతరించుకుంది.
హైదరాబాద్లో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను టీ న్యాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాలో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 60 గ్రాముల క్రిస్టల్ మెథాంఫెటమైన్, 700 మి.లీ లిక్విడ్ మెథాంఫెటమైన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. టీఎస్ న్యాబ్ ఎస్పీ గుమ్మి చక్రవర్తి ప్రెస్ మీట్ నిర్వహించారు. సూరారంలో డ్రగ్స్ తయారీ ముఠాను పట్టుకున్నామని అన్నారు. సూరారం పోలీసులతో పాటు టీఎస్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారని పేర్కొన్నారు.
5 టీ20 సిరీస్ లో భాగంగా టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది. నాలుగో టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. 20 పరుగుల తేడాతో ఇండియా గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది.
ఓ ఎలుక ఒక బొమ్మ స్కూటర్‌పై విన్యాసాలు చేస్తూ ఆనందంగా తిరుగుతూ ఉండటం కనిపిస్తుంది. అది చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో.. బొమ్మ స్కూటర్‌పై ఒక చిన్న ఎలుక ఆనందంగా విన్యాసాలు చేస్తూ కనిపిస్తుండటం మీరు చూడవచ్చు.
మాములుగా అయితే మనం బస్సుల్లో సీటు దొరకడం కోసమని కట్చీఫ్ వేసి మరీ సీటు దొరకపట్టుకుంటాం. దొరకని వాళ్లు నిలబడి ప్రయాణం చేస్తారు. కానీ.. మన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మాత్రం అలా ఉండదు. బస్సులో నిలబడటానికి కూడా స్థలం ఉండదు. ఎందుకంటే అంత రష్ ఉంటుంది. సినిమాల్లో కనిపించే విధంగా రోడ్లన్నీ ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. దాంతో పాటు బస్సుల్లో ఎప్పుడు ప్రయాణికులు నిండి ఉంటారు. అయితే అక్కడి పరిస్థితి తెలిసి కొందరు.. సీటు దొరకడం కోసమని తోపులాటలు, ఘర్షణలు పడి…
మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఓ ఉదంతం అమెరికాలో వెలుగు చూసింది. అరిజోనాలోని ఓ ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు చేసిన పని ప్రజల ఆగ్రహానికి కారణమైంది. గత నెలలో 79 ఏళ్ల వృద్ధురాలు మృతదేహంతో మార్చురీలో శృంగారంలో పాల్గొన్నాడు. దీంతో ఆ కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు.
కొమురం భీం జిల్లా కేంద్రంలో తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నాయకులు తమపై దాడులు చేస్తున్నారని తెలిపారు. నిన్న జరిగిన బూత్ నెం.90లో.. బీఆర్ఎస్ నేతలు ఒక వ్యక్తి కూర్చుని పెట్టి మరీ రిగ్గింగ్ కు పాల్పడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపించారు. మొదటి నుండే చెబుతున్నా.. ఇక్కడి పోలీసుల మీద నమ్మకం లేదని.. నిన్న తమపై దాడులకు పాల్పడిన వారిన ఇంత వరకు పట్టుకోలేదని…