Sandra Venkata Veeraiah: తెలంగాణ వ్యాప్తంగా నిన్న ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. అనంతరం సాయంత్రం 5.30 గం.లకు కొన్ని సర్వేల ద్వారా ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ వైపే ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా చూపించాయి. ఈ సందర్భంగా.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య ప్రెస్ మీట్ నిర్వహించారు.
Read Also: RBI: ఆర్బీఐకి చేరిన 2వేల రూపాయల నోట్లు.. ఇంకా ఎంత చేరాలంటే..?
రాత్రి 11 గంటల వరకు పోలింగ్ నడిచిందని సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. పోలింగ్ నడుస్తున్న సమయంలో ఎగ్జిట్ పోల్స్ కు ఎన్నికల కమీషన్ ఎలా అనుమతించారు..? అని ప్రశ్నించారు. సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా సాయంత్రం 5 గంటలు దాటిన తరువాత 30 వేలకు పైగా ఓట్లు పోల్ అయ్యాయని పేర్కొన్నారు. అలాంటప్పుడు ఎగ్జిట్ పోల్ ఎలా సరైందని విమర్శించారు. నూటికి నూరు శాతం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు.. సత్తుపల్లిలో నాల్గోసారి విజయం సాధిస్తున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. నా గెలుపు పై ఎలాంటి అనుమానం లేదు.. నేను గెలిస్తేనే సత్తుపల్లి ప్రజలు ఆనంద పడతారని సండ్ర వెంకట వీరయ్య తెలిపారు.
Read Also: AP Land Registrations: ఏపీవ్యాప్తంగా నిలిచిన భూముల రిజిస్ట్రేషన్లు