మంత్రి కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. "హ్యాట్రిక్ లోడింగ్ 3.o.. గెట్ రెడీ సెలబ్రేటీ గాయ్స్" అని ట్వీట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ గెలుపుపై మరింత విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ ఉదయం కూడా ఒక ట్వీట్ చేశారు.
చలికాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధగా ఉండాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో దగ్గు, జలుబు, జ్వరాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో వాటిని నివారించడానికి మీరు వంటగదిలో ఉండే సుగంధ ద్రవ్యాలతో దూరం చేయవచ్చు. అవి లవంగం, యాలకులు.. వీటిని పోషకాల నిధిగా పరిగణించుతారు. లవంగాలలో మాంగనీస్, విటమిన్ కె, పొటాషియం, బీటా కెరోటిన్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. యాలకుల్లో కూడా.. మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాల్షియం, విటమిన్ B-6, ప్రోటీన్, ఫైబర్, రైబోఫ్లావిన్, నియాసిన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
ప్రైవేట్ కార్పొరేట్ రంగానికి బ్యాంకులు ఇచ్చిన రుణాలు సెప్టెంబర్‌లో 14.9 శాతం పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తెలిపింది. బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించిన డేటాను విడుదల చేస్తూ సెంట్రల్ బ్యాంక్ ఈ సమాచారాన్ని ఇచ్చింది.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్ల తరలింపు ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. 29వ తేదీ నాటి పోస్టల్ బ్యాలెట్లను అధికారులు స్ట్రాంగ్ రూమ్ కి పంపించ లేదు. ఈ క్రమంలో.. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు ఆర్డీవో కార్యాలయానికి భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు.
త్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు మావోలు దుశ్చర్యకు పాల్పడ్డారు. రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత దంతెవాడ జిల్లాలో నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలుడులో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.
కాన్పూర్‌లో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య ప్రియుడితో కలిసి తన భర్త గొంతుకోసి హత్య చేసింది. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నిందితులు మృతదేహం దగ్గర పాయిజన్ బాటిల్ ఉంచారు. ఈ ఘటనలో నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని.. మరో యువకుడితో రెండో పెళ్లి చేసుకుంది.
హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. కౌంటింగ్ నేపథ్యంలో.. శనివారం సికింద్రాబాద్ వెస్లీ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లను ముందుగా పరిశీలించారు.
ఒకప్పుడు పాములు చూద్దామంటే కనబడని పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజుల్లో వాటి ఆవాసాలను వదిలి ఇళ్లు, కార్లు, బైకుల్లో తిష్టవేస్తున్నాయి. ఎక్కడ వాటికి కాస్త అనుకూలంగా అనిపిస్తే అక్కడే సెటిలైపోతున్నాయి. తాజాగా.. ఓ షూలో నాగుపాము పిల్ల దర్శనమిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూస్తే మీకు గూస్ బంప్స్ రావడం ఖాయం. ఈ వైరల్ వీడియోలో నాగుపాము పిల్ల ఓ షూలో ఉంటుంది.
రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు మొదలు కానుంది. ఈ క్రమంలో స్ట్రాంగ్‌రూంల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 40 కంపెనీల కేంద్ర బలగాలు ఈవీఎంల వద్దు బందోబస్తుగా ఉన్నారు.
గర్భం దాల్చిన ఓ మహిళను గురువారం ఉదయం లాడ్‌లో కత్తితో పొడిచి చంపారు దుండగులు. ఈ ఘటనలో ఆమె కడుపులో పెరుగుతున్న శిశువు కూడా మరణించింది. తీవ్రంగా గాయపడిన మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు ఆమె పుట్టబోయే బిడ్డను రక్షించే ప్రయత్నంలో అత్యవసర సిజేరియన్ ఆపరేషన్ చేశారు. అప్పటికే వారిద్దరూ చనిపోయారని వైద్యులు తెలిపారు.