2024లో టాబ్లెట్‌లు తిరిగి ట్రెండ్‌లోకి వచ్చాయి. 2020 తర్వాత టాబ్లెట్‌ల అమ్మకాలు పెరగడం ఇదే తొలిసారి. కెనాలిస్ తాజా నివేదిక ప్రకారం.. 2024లో ప్రపంచవ్యాప్తంగా 147.6 మిలియన్ (14.7 కోట్ల) టాబ్లెట్‌లు అమ్ముడయ్యాయని అంచనా.
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో సెంచరీల పరంపర కొనసాగిస్తున్నాడు. ఇటీవల అతను నాలుగు సెంచరీలు సాధించాడు. గత 8 ప్రొఫెషనల్ మ్యాచ్‌లను కూడా కలుపుకుంటే అతను మొత్తం 5 సెంచరీలు సాధించాడు. వాటిలో ఒకటి టీ20 లీగ్‌లో జరిగింది. తాజాగా.. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో స్మిత్ సెంచరీ సాధించి అనేక రికార్డులు సాధించాడు. స్టీవ్ స్మిత్ 191 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇది అతని టెస్ట్ క్రికెట్‌లో 36వ సెంచరీ.
ఈ నెల 19 నుండి పాకిస్తాన్-దుబాయ్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభంకానుంది. అనేక వివాదాలు, సన్నాహాల్లో జాప్యాల తరువాత పాకిస్తాన్ ఈ కార్యక్రమానికి సిద్ధమైంది. ఈ క్రమంలో శుక్రవారం ఐసీసీ ఈ టోర్నమెంట్ థీమ్ సాంగ్‌ను విడుదల చేసింది. పాకిస్తాన్ ప్రసిద్ధ గాయకుడు అతిఫ్ అస్లామ్ పాడిన 'జీతో బాజీ ఖేల్ కే' తాజాగా విడుదల చేశారు.
జపనీస్ సూపర్ బైక్ తయారీదారు కవాసకి.. 2025 ఫిబ్రవరిలో భారతదేశంలోని కస్టమర్లకు బంపర్ డిస్కౌంట్లను అందించనుంది. కవాసకి Z900, నింజా 650, నింజా 300, నింజా 500 మోడల్‌లపై ప్రత్యేక డిస్కౌంట్లు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ఫిబ్రవరి 28 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కవాసకి ఈ మోటార్ సైకిళ్లపై రూ. 15,000 నుండి రూ. 45,000 వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది.
ఫిబ్రవరి 9న కటక్‌లో భారత్-ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ ఫిట్‌గా ఉంటాడా..? రెండో వన్డేలో కోహ్లీ ఆడుతాడా లేదా అన్నది భారత వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ అప్ డేట్ ఇచ్చాడు. అభిమానులకు గిల్ గుడ్ న్యూస్ చెప్పాడు. విరాట్ కోహ్లీ గాయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కటక్‌లో జరిగే రెండో వన్డేకు కోహ్లీ తిరిగి జట్టులోకి వస్తాడని ఆయన తెలిపాడు.
తీన్మార్ మల్లన్న విషయంలో తనకు మాట్లాడేంత టైమ్ లేదని.. మాట్లాడం వేస్ట్ అని అన్నారు. తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ, ఏఐసీసీ, క్రమశిక్షణ చైర్మన్ చిన్నారెడ్డి నోటీసులు ఇచ్చినట్లు పేపర్‌లో చూశానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో 56.6 శాతం బీసీలు ఉన్నట్లుగా తేల్చామని తెలిపారు.
పార్టీ ఫిరాయింపులపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడుతున్న వారు ఇద్దరూ దొందు దొందే అని విమర్శించారు.
భారతదేశంలోని వినియోగదారుల కోసం వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్‌ను ప్రారంభించనున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. దీని ద్వారా వినియోగదారులు వాట్సాప్ ద్వారా నేరుగా అన్ని రకాల బిల్లులను చెల్లించుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా విద్యుత్ బిల్లు, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్, ఎల్‌పిజి గ్యాస్ చెల్లింపు, నీటి బిల్లు, ల్యాండ్‌లైన్ పోస్ట్‌పెయిడ్ బిల్లు, అద్దె చెల్లింపులు కూడా చెల్లించుకోవచ్చు.
నాగ్‌పూర్‌లో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత జట్టు 248 పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
బీట్‌రూట్ అనేది ఒక సమృద్ధిగా పోషకాలు కలిగిన కూరగాయ. దీని రసం ప్రతిరోజూ తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. బీట్‌రూట్ రసంలో నైట్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ C ఉన్నందున.. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, జ్ఞాపకశక్తిని పెంచడం, చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది.