హిట్ మ్యాన్‌గా పేరొందిన రోహిత్ శర్మకు ఏమైంది.. 2024 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టైటిల్ గెలిచినప్పటి నుండి అతను సరిగా ఆడటం లేదు.. దీంతో.. తన బ్యాట్‌కు ఏదో ఒక శాపం తగిలి ఉంటుందని క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తీవ్ర నిరాశ పరిచిన రోహిత్ శర్మ.. ఆ తర్వాత రంజీలో ఆడాడు. అక్కడ కూడా ఇదే రకమైన ప్రదర్శన కనబరిచాడు.
ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్.. భారతదేశంలో రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ II లైనప్‌ను ప్రారంభించింది. ఈ ఆటోమేకర్ తన ప్రామాణిక ఘోస్ట్ సిరీస్ II, ఎక్స్‌టెండెడ్ ఘోస్ట్ సిరీస్ II, బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ సిరీస్ II మోడళ్లను ఇండియాలో విడుదల చేసింది.
భారత జట్టు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. యశస్వి అరంగేట్రంలోనే అద్భుతమైన ఫీల్డింగ్ చేశాడు. బెన్ డకెట్ క్యాచ్‌ను వెనక్కి పరిగెడుతూ అద్భుతంగా పట్టుకున్నాడు.
ఇంగ్లాండ్-భారత్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ నాగ్‌పూర్‌లో జరుగుతోంది. విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో రవీంద్ర జడేజా రికార్డు పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు.
ఇంగ్లాండ్-భారత్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ నాగ్‌పూర్‌లో జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో.. 248 పరుగులకే ఆలౌట్ అయింది.
ఇప్పటివరకు అనేక అధ్యయనాలలో పురుషుల కంటే స్త్రీలు తక్కువ గుండెపోటు ప్రమాదాలకు గురవుతారని కనుగొన్నారు. అయితే.. తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో మెనోపాజ్ (రుతుక్రమం ఆగిపోవడం) అనుభవించిన స్త్రీలు గుండె సంబంధిత వ్యాధులు పట్ల తక్కువగా ప్రభావితం అవుతారని వెల్లడైంది. వారి రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయని.. దీని ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనం తెలిపింది.
భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ మారుతి సుజుకి, నెక్సా డీలర్‌షిప్ ద్వారా కొన్ని అత్యుత్తమ కార్లు .. SUVలపై ఫిబ్రవరి 2025 కోసం భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.
వియత్నాం ఎలక్ట్రిక్ కార్ల తయారీదారు విన్‌ఫాస్ట్ (VinFast).. 2025 జనవరిలో జరిగిన ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో అనేక వాహనాలను ప్రదర్శించింది. ఇందులో విన్‌ఫాస్ట్ VF 6, విన్‌ఫాస్ట్ VF 7లను కూడా ప్రవేశపెట్టింది. వీటిని 2025 పండుగ సీజన్‌లో భారతదేశంలో ప్రారంభించవచ్చు.
ఈ ఏడాది ప్రవేశ పరీక్షలకు సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన చేసింది. తాజాగా.. తెలంగాణ ఎడ్సెట్ షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 1న పరీక్ష నిర్వహించనున్నారు. అందుకోసం వచ్చే నెల (మార్చి) 10న నోటిఫికేషన్ ఇవ్వనుంది. మార్చి 12 నుండి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నుంచి ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాను తొలగించారు. మంగళవారం భారత వన్డే జట్టు ప్రకటించినప్పుడు బుమ్రా పేరు జట్టులో లేదు.