జపనీస్ సూపర్ బైక్ తయారీదారు కవాసకి.. 2025 ఫిబ్రవరిలో భారతదేశంలోని కస్టమర్లకు బంపర్ డిస్కౌంట్లను అందించనుంది. కవాసకి Z900, నింజా 650, నింజా 300, నింజా 500 మోడల్‌లపై ప్రత్యేక డిస్కౌంట్లు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ఫిబ్రవరి 28 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కవాసకి ఈ మోటార్ సైకిళ్లపై రూ. 15,000 నుండి రూ. 45,000 వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్లకు సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
1. నింజా 300
నింజా 300 బైక్ ధర రూ.3.43 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ బైకుపై డిస్కౌంట్ రూ.15,000 వరకు రానుంది. ఇక ఈ బైక్ ఇంజిన్ విషయానికొస్తే.. 296cc, సమాంతర-ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. అలాగే.. 38.88 bhp శక్తి, 26.1Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైకులో 6-స్పీడ్ స్లిప్పర్ క్లచ్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఫీచర్ల విషయానికొస్తే.. హాలోజన్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్‌ఫోన్ కనెక్ట్ చేయబడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.
2. నింజా 500
నింజా 500 బైకు ధర రూ.5.24 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది. ఈ బైకుపై డిస్కౌంట్ రూ.15,000 వరకు ఉండనుంది. ఈ బైకు ఇంజిన్ 451cc, సమాంతర-ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. పవర్ విషయానికొస్తే.. 44.7 bhp శక్తి, 42.6 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైకులో కూడా 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. 5-అంగుళాల LCD డిస్ ప్లే, రైడాలజీ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, స్లిప్.. అసిస్ట్ క్లచ్, డ్యూయల్-ఛానల్ ABS ఫీచర్లను కలిగి ఉంటుంది.
3. కవాసకి నింజా 650
కవాసకి నింజా 650 ధర రూ.7.16 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది. ఈ బైకుపై డిస్కౌంట్ రూ.45,000 వరకు ఇవ్వనున్నారు. ఈ బైకు ఇంజిన్ 649cc, సమాంతర-ట్విన్, లిక్విడ్-కూల్డ్, DOHC, 4-వాల్వ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. అలాగే.. 67 bhp శక్తి, 64 Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైకులో 6-స్పీడ్ స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఫీచర్ల విషయానికొస్తే.. ట్విన్ LED హెడ్‌లైట్లు, 4.3-అంగుళాల కలర్ TFT డిస్‌ప్లే, రైడాలజీ యాప్ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీ, వెనుక సీటుపై మెరుగైన ప్యాడింగ్ను కలిగి ఉంటుంది.
4. కవాసకి Z900
కవాసకి Z900 బైకు ధర రూ.9.38 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ బైకుపై డిస్కౌంట్ రూ.40,000 వరకు ఉండనుంది. దీని ఇంజిన్ 948cc, లిక్విడ్-కూల్డ్, ఇన్‌లైన్-ఫోర్ ఇంజిన్ కలిగి ఉంటుంది. 123.6 bhp శక్తి, 98.6 Nm టార్క్ పవర్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైకులో 6-స్పీడ్ స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్ గేర్‌బాక్స్ ఉంటాయి. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. LED హెడ్‌లైట్, TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, నాలుగు రైడింగ్ మోడ్‌లు, మూడు-స్థాయి ట్రాక్షన్ కంట్రోల్, రెండు పవర్ మోడ్‌లు ఉంటాయి. అయితే.. ఈ ఆఫర్‌లను ఉపయోగించుకోవడానికి ఫిబ్రవరి 28లోగా కవాసకి అధికారిక డీలర్‌షిప్‌ను సంప్రదించండి.