మేడిగడ్డ బ్యారేజ్ ను తెలంగాణ మంత్రుల బృందం పరిశీలించింది. బ్యారేజీకి బుంగలు పడ్డ చోటును మంత్రులు పరిశీలించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టులో లోపాలన్ని మానవ తప్పిదాలేనని తెలిపారు. లోపాలపై నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు.. మేడిగడ్డ కుంగడంతో రెండో పంటకు సాగునీటిపై సందిగ్ధత ఏర్పడిందని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆలోచిస్తున్నాం.. మేడిగడ్డ పరిశీలనపై సీఎంకి రెండు.. మూడు రోజుల్లో నివేదిక ఇస్తామని అన్నారు. కాళేశ్వరంపై ఏం చేస్తాం అనేది..…
తెలంగాణ ఇంటర్ బోర్డు ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు సంబంధించి అప్డేట్ ఇచ్చింది. రూ.2,500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించేందుకు గడువు పొడిగించింది. వచ్చే నెల మూడో తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయినా.. పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. అందుకోసం జనవరి మూడో తేదీ నుంచి బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించనుంది. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, పార్టీ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితర…
కాంగ్రెస్ ప్రజాపాలనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హామీలు అమలు చేయలేక ప్రజాపాలన పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఎలాంటి అప్లికేషన్లు లేకుండానే తాము లబ్ధిదారులను ఎంపిక చేశామని... ఇప్పుడు దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని విమర్శలు గుప్పించారు. ప్రజలు అడిగేది పథకాలు.. పత్రాలు కాదని జగదీష్ రెడ్డి అన్నారు. దరఖాస్తులు లేకుండా... దళారి వ్యవస్థ లేకుండా తాము ఆన్ లైన్ విధానం ద్వారా అర్హులను ఎంపిక చేశామన్నారు. ఆరు…
ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) నిరంతరం కృషి చేస్తోంది. రవాణా రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్దతుల ద్వారా ప్రయాణికులకు చేరువ అవుతోంది. అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను కొనుగోలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాటిలో 400 ఎక్స్ ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్,…
హైదరాబాద్ లో వీధికుక్కలు వీర విహారం సృష్టిస్తున్నాయి. మొన్నటికి మొన్న వీధి కుక్కల దాడిలో ఓ పసిబాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. కొన్ని చోట్ల మనుషులపై ఎగబడి దాడికి పాల్పడుతున్నాయి. ఇది రేబిస్ వ్యాధికి దారితీస్తుంది. చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. వీధికుక్కల బెడదను నియంత్రించడంలో ప్రభుత్వాలు సమర్థవంతమైన చర్యలను అమలు చేయడంలో విఫలమయ్యాయనే ఆరోపణలు వినిపిస్తుంటాయి.
మేడిగడ్డలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, పొంగులేటి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, పొన్నం ప్రభాకర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మేడిగడ్డ నిర్మాణంపై అధికారులు రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను పరిశీలించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళపై తాము చెప్తున్న విషయాలు నిజం అయ్యాయని తెలిపారు. లక్షల కోట్లు అప్పు.. పదుల కోట్లు బిల్లులు బకాయి అని ఆరోపించారు. మరి ప్రాజెక్టు కట్టిన ప్రయోజనం ఏంటి అని ప్రశ్నించారు. కాళేశ్వరంకు జాతీయ హోదా కోసం అప్పటి…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' చిత్రం మరో వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఈ చిత్రంపై నారా లోకేశ్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. వ్యూహం సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వద్దని ఏపీ హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ పిటిషన్ వేసింది.
పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తనను గుర్తించలేదు.. ఇది దురదృష్టకరమని అన్నారు. తనకు ఎన్ని అవమానాలు ఎదురైనా నియోజకవర్గ ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని చెప్పారు. తాను ఎమ్మెల్యే కాదు సేవకుడిగా ఉంటానని తెలిపారు. తాను ఎక్కడ ఉన్నా పెనమలూరు ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు ఎమ్మెల్యే పార్థసారథి.
రేపు జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల కానున్నాయి. జూలై-సెప్టెంబర్, 2023 త్రైమాసికానికి సంబంధించి లబ్దిదారుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. వర్చువల్ గా లబ్ధిదారుల ఖాతాల్లోసీఎం జగన్ నిధులు జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా.. 8,09,039 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. అందుకోసం రూ. 584 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. 11 లక్షలకు పైగా తల్లుల కాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు.