విజయవాడలో ఈనెల 19వ తేదీన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ జరగనుంది. విగ్రహావిష్కరణ విజయవంతం చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్, పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ షేక్ ఆసిఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయ సాధకుడు జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. అంబేద్కర్ గొప్పతనాన్ని తెలియజేసేలా స్మృతివనం ఉండబోతోందని తెలిపారు. విజయవాడ నగరం గతంలో ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉందో అందరూ గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు కార్పొరేట్ వ్యక్తులకు స్వరాజ్య మైదానాన్ని కట్టబెట్టాలని చూశారని అవినాష్ దుయ్యబట్టారు. జగన్ రాజ్యాంగ ప్రదాత అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అవినాష్ తెలిపారు.
Read Also: Bihar: భారతీయ ముస్లింలకు ప్రత్యేక మాతృభూమి కావాలి.. ప్రొఫెసర్ వివాదస్పద పోస్ట్..
మరోవైపు.. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రతీ సామాజిక వర్గాన్ని గుర్తించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. మహోన్నతమైన అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. 19వ తేదీన అందరూ తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని షేక్ ఆసిఫ్ కోరారు.
Read Also: Hi Nanna : ఓటీటీ లో సూపర్ రెస్పాన్స్ అందుకుంటున్న హాయ్ నాన్న..