ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఇండియా-ఇంగ్లాడ్ తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. ఇండియా 202 పరుగులకు ఆలౌటైంది. 28 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. 5 టెస్టుల సిరీస్ లో మొదటి టెస్ట్ లో ఇంగ్లాండ్ గెలుపొందింది. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ 246 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ 436 పరుగులకు ఆలౌటైంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 420 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. భారత్ రెండో ఇన్నింగ్స్ లో 202 పరుగులు చేసి ఆలౌటైంది.
Read Also: Pinarayi Vijayan: కేరళలో ముదురుతున్న గవర్నర్-సీఎం మధ్య వార్..
కాగా.. ఈ మ్యాచ్ లో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. 231 పరుగుల లక్ష్యచేధనలో భారత్ బ్యాటర్లు తడబడ్డారు. స్పిన్ కు అనుకూలిస్తున్న పిచ్ లో ఇంగ్లాండ్ స్పిన్నర్ టామ్ హార్ట్లీ 7 వికెట్లు తీసి ఇంగ్లాండ్ జట్టుకు గెలుపు బాటలు వేశాడు. కీలక బ్యాటర్లు మొదట్లోనే పెవిలియన్ బాట పట్టినప్పటికీ, చివరలో శ్రీకర్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ సిరాజ్ పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
Read Also: Karnataka: “హనుమాన్ జెండా వివాదం”.. తొలగించిన అధికారులు, ఉద్రిక్తత..
231 పరుగులు ఈజీగా చేధిస్తారనుకున్న టీమిండియాను ఇంగ్లాండ్ బౌలర్లు ఘోరమైన దెబ్బ తీశారు. భారత్ బ్యాటింగ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 39, యశస్వీ జైస్వాల్ 15, శుభ్ మాన్ గిల్ డకౌట్ రూపంలో పెవిలియన్ బాటపట్టాడు. కేఎల్ రాహుల్ 22, అక్షర్ పటేల్ 17, శ్రేయాస్ అయ్యర్ 13, రవీంద్ర జడేజా 2, శ్రీకర్ భరత్ 28, ఆర్. అశ్విన్ 28, బుమ్రా 6, మహమ్మద్ సిరాజ్ 12 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో స్పిన్నర్ టామ్ హార్ట్ లీ 7 వికెట్లు పడగొట్టాడు. జో రూట్, జాక్ లీచ్ కు తలో వికెట్ దక్కింది.