రేపు(సోమవారం) స్పీకర్ ముందుకు అనర్హత పిటిషన్లు అంశం రానుంది. కాగా.. వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరు పై ఉత్కంఠ నెలకొంది. రేపటి విచారణకు ముగ్గురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరుకానుండగా.. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో.. రేపటి విచారణకు హాజరు కాలేనని స్పీకర్ కార్యాలయంకు సమాచారం ఇచ్చారు. ఫిబ్రవరి రెండో తేదీన విచారణకు హాజరు అవుతానని ఎమ్మెల్యే గిరి తెలిపారు.
Read Also: IND vs ENG: ఉప్పల్ టెస్ట్లో భారత్ ఓటమి..
మరోవైపు.. మధ్యాహ్నం 12 గంటలకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరు కావాల్సి ఉంది. నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల పై అనర్హత వేటు ఉంది. కాగా.. ఈ ఎమ్మెల్యేల హాజరు పై ఉత్కంఠ నెలకొంది. రేపటి విచారణకు హాజరు కాలేమని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సమాచారం ఇచ్చారు. అనారోగ్య కారణాలతో హాజరు కాలేనని స్పీకర్ కార్యాలయంకు సమాచారం ఇచ్చారు. అతనితో పాటు మరో రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా.. అనారోగ్య కారణాలతో హాజరుకాలేమని తన వర్గం స్పీకర్ కు సమాచారం ఇచ్చారు. మరోవైపు.. ఆనం, కోటంరెడ్డి హాజరు పై ఇంకా స్పష్టత రాలేదు.
Read Also: Asaduddin Owaisi: “నేను ఎప్పటి నుంచో ఇదే చెబుతున్నా నమ్మలేదు”.. బీహార్ రాజకీయాలపై ఓవైసీ ఫైర్…