వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా హెల్త్ మినిస్టర్ అంబర్ జెడ్ సండర్సన్, గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ కు చెందిన ఉన్నత స్థాయి అధికారుల బృందం హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో సమావేశమయ్యారు. గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో మెడికల్, పారామెడికల్ హెల్త్ కేర్ రంగాలలో ఉన్న ఉద్యోగ, ఉపాధి అవకాశాల పై రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ… తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ద్వారా నాణ్యమైన వైద్య విద్యను అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏటా 8515 మెడికల్ గ్రాడ్యుయేట్స్, 6880 మంది నర్సింగ్ గ్రాడ్యుయేట్స్లతో పాటు 22,970 మంది పారా మెడికల్ కోర్సులను విజయవంతంగా పూర్తి చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ నగరం మెడికల్ వ్యాల్యూ టూరిజం డెస్టినేషన్గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినట్లు మంత్రి వెల్లడించారు.
Yarlagadda Venkat Rao: ఇంటింటికి తిరుగుతూ ఆరు హామీలను ప్రజలకు వివరించిన యార్లగడ్డ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో TOMCOM (తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్) ద్వారా నర్సింగ్, పారామెడికల్ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రొఫెషనల్స్గా శిక్షణ ఇస్తున్నామని.. వారు ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందడానికి చర్యలు తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రానికి చెందిన మెడికల్, పారా మెడికల్ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి దామోదర్ రాజనర్సింహ గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా వైద్య శాఖ మంత్రి అంబర్ జెడ్ సండర్సన్కు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా హెల్త్ మినిస్టర్ అంబర్ జెడ్ సండర్సన్ను ఘనంగా సన్మానించారు.
Deepti Sunaina: బరువు దింపేసుకున్నారన్న అభిమాని.. దీప్తి షాకింగ్ రిప్లై!