అనంతపురం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘న్యాయ సాధన’ సభ పేరుతో బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. అనంతపురం జిల్లా అంటే సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి అమిత ప్రేమ అని అన్నారు. మరోవైపు.. రాష్ట్ర అభివృద్ధి వైఎస్సార్ హాయంలోనే జరిగినట్లు చెప్పారు. అలాంటి.. సుపరిపాలన అందించేందుకు వైఎస్ షర్మిలను మీ ముందుకు తీసుకొచ్చామని ఖర్గే పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతుందని, తప్పకుండా అధికారంలోకి వస్తామని దీమా వ్యక్తం చేశారు.
Read Also: INDIA Bloc: వయనాడ్‌లో అభ్యర్థిని ప్రకటించిన సీపీఐ.. రాహుల్ పరిస్థితి ఏంటి?
మరోవైపు బీజేపీపై ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ ఎప్పుడూ కాంగ్రెస్ బలహీనం అయిందంటున్నారు… అదే జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వాలను ఎందుకు కూల్చుతున్నాడని మండిపడ్డారు. అంతేకాకుండా.. ఎందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నియంత మోడీ వల్లనే రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చిందని తెలిపారు. మరోవైపు.. రాహుల్, సోనియా గాంధీపై తిట్ల దండకం చేస్తున్నారని.. తనను కూడా వదలడం లేదని అన్నారు.
Read Also: Samantha: 14 ఏళ్ల కెరీర్ లో సామ్ ఎన్ని హిట్లు అందుకుందో తెలుసా.. ?
దేశం అంతా అభివృద్ధి చేసింది తానేనని మోడీ అంటున్నారని.. ఆహార భద్రత చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ కాదా అని ఖర్గే తెలిపారు. దేశానికి మోడీ చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. మోడీ ధనికుల కోసమే పని చేస్తున్నాడని మండిపడ్డారు. మరోవైపు.. రాష్ట్రంలో జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోడీ అంటే భయం పడుతున్నారని విమర్శించారు.