Marriage Proposal: లైవ్ మ్యాచ్లో ఓ లేడీ క్రికెటర్కు అభిమాని పెళ్లి ప్రపోజల్.. ఫొటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమకు ఇష్టమైన ఆటగాళ్ల కోసం అభిమానులు ఏది చేయడానికైనా సిద్ధం అనే విధంగా ఉంటారు. క్రికెట్ మ్యాచ్ లు ఎక్కడ జరుగుతున్నా సరే.. అక్కడికి వెళ్లి సపోర్ట్ చేస్తుంటారు. ముఖ్యంగా.. భారతీయులు ఏ కంట్రీలో మ్యాచ్ జరిగినా వెళ్తుంటారు. ఇదిలా ఉంటే.. మ్యాచ్ మధ్యలో కొందరు అభిమానులు తమకు ఇష్టమైన ఆటగాళ్ల పేర్లను ప్లకార్డులపై రాసి చూపిస్తారు. వారి మనసులో ఏదనుకుంటారో దానిని ప్లకార్డుపై వ్యక్తపరుస్తారు. నాకు ఈ ఆటగాడు అంటే ఇష్టం, ఇతని బ్యాటింగ్ అంటే ఇష్టం, బౌలింగ్ అంటే ఇష్టం, లవ్ అండ్ మ్యారేజ్ ప్రపోజల్స్.. ఇలా తమకు నచ్చిన విధంగా ప్లకార్డులపై రాస్తారు. అయితే కొన్నిసార్లు వాళ్ల వీడియో టీవీలో వచ్చినప్పుడు సంతోష పడుతారు.
Vijayasai Reddy: వైసీపీలో ఆత్మగౌరవ సమస్య అనేది రాదు.. అలా ఏ చర్యలు ఉండవు..
Also Read
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
అసలు విషయానికొస్తే, మహిళా ప్రీమియర్ లీగ్ మ్యాచ్ జరుగుతున్న క్రమంలో.. ఓ లేడీ క్రికెటర్ కు వీరాభిమాని పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ లేడీ క్రికెటర్ ఎవరునుకుంటున్నారా.. ఆర్సీబీకి చెందిన ప్లేయర్ శ్రేయాంక పాటిల్. మంగళవారం(ఫిబ్రవరి 27)న గుజరాత్ జెయింట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఓ ఇంట్రెస్టింగ్ సన్నివేశం కనిపించింది. ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న ఓ అభిమాని.. పెళ్లి ప్రపోజల్ చేశాడు. ‘విల్ యూ మ్యారీ మీ శ్రేయాంక పాటిల్’ అని ప్లకార్డుపై రాశాడు. అందులో రెడ్ హార్ట్ సింబల్ కూడా ఉంది.
PM Modi: సచిన్ టెండూల్కర్ కాశ్మీర్ ట్రిప్‌పై మోడీ కీలక పోస్ట్
ఈ సీన్ బిగ్ స్క్రీన్ పై కనిపించగానే డగౌట్ లో కూర్చున్న ఆర్సీబీ ప్లేయర్లు నవ్వులు చిందించారు. శ్రేయాంక కూడా చిన్న స్మైల్ తో తన రిప్లైని ఇచ్చింది. ఈ ప్లకార్డులో అతని పేరు కన్నడలో ఉంది. దీన్ని బట్టి ప్రపోజ్ చేసిన యువకుడు స్థానికుడే అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే.. లేడీ ఫ్యాన్స్ పురుష క్రికెటర్లకు లవ్, మ్యారేజ్ ప్రపోజల్స్ చేయడం ఎక్కువగా చూస్తుంటాం. కానీ చాలా తక్కువ సందర్భాల్లో లేడీ క్రికెటర్లకు ఇలాంటి ప్రపోజల్స్ చూస్తుంటాం.
Marriage proposal for Shreyanka Patil and RCB’s players laughing in the dressing room. pic.twitter.com/yoY4e5zfxK
— Tanuj (@ImTanujSingh) February 27, 2024
- Tags
- cricket
- fan
- Live Match
- Marriage
- Propose
తాజావార్తలు
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!