చాలా మందిలో పాదాలు విపరీతంగా పొడిబారడం లేదా మడమలలో పగుళ్లు సమస్య ఉంటుంది. దీంతో.. పొడిబారిన చర్మంతో ఎక్కువసేపు పని చేయడం, నేలపై చెప్పులు లేకుండా నడవడం, ఊబకాయం వంటి సమస్యలు ఏర్పడుతాయి. మీ పాదాల పగుళ్ళను నివారించడానికి అనేక హోం రెమడీస్ ను మీరు ఉపయోగించి ఉండవచ్చు. అయితే.. ఈ హోం రెమెడీస్ ను ఎంత ఉపయోగించినా, మీరు నేచురల్ ఆయిల్స్ ను ఉపయోగించడం వల్ల మరింత ఉత్తమ ఫలితం లభిస్తుందంటారు. పాదాలు పగుళ్ళను నివారించి పాదాలను తేమగా ఉంచుకోవచ్చు. ఇంతకీ అవెంటో తెలుసుకుందాం..
నిమ్మ, చక్కెర
పాదాల కింద ఉన్న పొడి చర్మాన్ని తొలగించడానికి, పొడి పాదాలను మృదువుగా చేయడానికి.. నిమ్మ, చక్కెరను కలిపి పాదాలకు రాయాలి. ముందుగా 2 చెంచాల చక్కెరలో నిమ్మకాయను కలిపి.. ఆ తర్వాత స్క్రబ్‌గా తయారు చేసి పాదాలకు రుద్దాలి. కనీసం 4 నుంచి 5 నిమిషాల పాటు ఉంచిన తర్వాత కడిగేయాలి. పాదాలపై ఉన్న డెడ్ స్కిన్ తొలగిపోయి పాదాలు మృదువుగా కనిపిస్తాయి.
కొబ్బరి నూనే
పాదాలు పొడిబారకుండా ఉండేందుకు కొబ్బరి నూనె కూడా రాయోచ్చు. దీనిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు.. పొడి బారిన పాదాలను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. ప్రతి రాత్రి కొబ్బరి నూనెను మీ పాదాలకు రాసుకుంటే.. రిజల్ట్ కనిపిస్తుంది.
తేనె
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్న తేనె.. పొడి చర్మానికి తేమను అందించడంలో మంచి ప్రభావాన్ని చూపుతుంది. పొడి చర్మంపై తేనెను రాసి కొన్ని నిమిషాల తర్వాత కడగాలి. కావాలంటే తేనెలో నిమ్మరసం, బియ్యప్పిండి కలిపి ఫుట్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. ఈ ఫుట్ మాస్క్ పాదాలపై 20 నిమిషాల పాటు ఉంచిన తర్వాత కడగాలి. ఇలా చేయడం ద్వారా పొడి బారిన పాదాలు తొలగిపోతాయి.
అరటిపండు
మీకు మడమలు పగిలినా లేదా మీ పాదాలపై ఎక్కువగా పొడిబారినా.. అరటిపండు దివ్యౌషధమని రుజువు చేస్తుంది. అరటిపండులో విటమిన్ ఎ, బి6 మరియు విటమిన్ సి ఉంటాయి. ఇది చర్మంపై తేమను కాపాడుతుంది. ఒక రెండు అరటిపండ్లను తీసుకుని వాటిని మెత్తగా చేయాలి. ఆ తర్వాత పొడిబారిన పాదాలకు అప్లై చేసి, పాదాలకు కాస్త పాలిథిన్ చుట్టాలి. అరటిపండును ఇలా వారానికి 2 నుంచి 3 సార్లు ఉపయోగించడం వల్ల పాదాల పొడిబారి తొలగిపోయి పాదాలు మృదువుగా కనిపిస్తాయి.