Aroori Ramesh: బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇతర పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆరూరి పార్టీ వీడకుండా.. బీఆర్ఎస్ సీనియర్ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నిన్న బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసే బీజేపీలో చేరినట్లు ఆరూరి రమేష్ తెలిపారు. వరంగల్ జిల్లాలో బీజేపీ కార్యకర్తలతో కలిసిపోయి పార్టీ కోసం పనిచేస్తానని వెల్లడించారు.
Read Also: Hyderabad: చిన్నారిపై కుక్కల దాడి.. పరిస్థితి విషమం
Also Read
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
ఇదిలా ఉంటే.. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆరూరి రమేష్ పోటీ చేసే అవకాశం ఉంది. మరోవైపు.. కేసీఆర్ ఇంట్లో జరిగిన వరంగల్ లోక్‌సభ సన్నాహక సమావేశంలో ఆరూరి రమేష్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయాలని, గెలిపించుకుంటామని కేసీఆర్ కోరగా, ఆరూరి తిరస్కరించారు. మళ్లీ బీజేపీ నేతలకు టచ్లోకి వెళ్లారు. ప్రధాని మోదీ పర్యటన కారణంగా నేతలు బిజీగా ఉండటంతో ఆయన చేరిక ఆలస్యమైంది. ఈ క్రమంలో శనివారం బీఆర్ఎస్కు రాజీనామా చేసిన ఆరూరి ఆదివారం బీజేపీలో చేరారు.
Read Also: Viral: దోశ ఆర్డరిచ్చిన మహిళ.. అనుమానం వచ్చి పరిశీలించగా.. ఏకంగా.?
తాజావార్తలు
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్డౌన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు