Atchannaidu: ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ.. ప్రభుత్వ సలహాదారుపై ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాకు తెలుగుదేశం ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఈసీకి అచ్చెన్నాయుడు సోమవారం ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన సజ్జలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడం కోసం సలహాదారు పదవి నుంచి సజ్జలను తొలగించాలని పేర్కొన్నారు. సజ్జల ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నేతలా మాట్లాడుతున్నారని తెలిపారు. గత ఐదేళ్ళుగా ప్రభుత్వ సలహాదారుడిలా కాకుండా వైసీపీ కార్యకర్తలా ప్రతిపక్షాలపై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Chandrababu: మందుబాబులకు చంద్రబాబు బంపర్ ఆఫర్..
Also Read
ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ప్రభుత్వ ఖజానా ఖర్చుతో అధికార పార్టీ పనులు చేస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ మార్చి 18, 22న ప్రెస్ మీట్‌లు పెట్టి ప్రతిపక్షాలపై బహిరంగ ఆరోపణలు చేశారని తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం రాజకీయ నాయకులు, అధికారుల మధ్య వ్యక్తిగతంగా లేదా సమిష్టిగా వీడియో కాన్ఫరెన్సులు నిషేధం అని చెప్పారు. అందుకు విరుద్ధంగా వైసీపీ నేతలు.. అభ్యర్ధులతో సజ్జల భేటీలు, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఐపీసీ 171, 123, 129, 134, 134A సెక్షన్‌లను సజ్జల ఉల్లంఘించారు.. RP 1951 యాక్ట్‌కు విరుద్ధంగా సజ్జల వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read Also: Bengaluru: ప్రజలకు నీటి కష్టాలు.. 22 కుటుంబాలకు జరిమానా
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్‌లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు