ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదటగా బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటింగ్ లో సాయి సుదర్శన్ (45) పరుగులతో రాణించాడు. చివరలో రాహుల్ తెవాటియా (22) పరుగులు చేసి జట్టుకు ఫైటింగ్ స్కోరు అందించారు.
BJP 5th List: బీజేపీ ఐదో జాబితా విడుదల.. తెలంగాణలో ఇద్దరు, ఏపీలో 6గురు అభ్యర్థులు ప్రకటన
గుజరాత్ బ్యాటింగ్ లో ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (19), శుభ్ మాన్ గిల్ (31), అజ్మతుల్లా ఒమర్జాయ్ (17), డేవిడ్ మిల్లర్ (12), విజయ్ శంకర్ (6), రషీద్ ఖాన్ (4) పరుగులు చేశారు. ముంబై బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లతో చెలరేగాడు. గెరాల్డ్ కోయెట్జీకి 2 వికెట్లు దక్కాయి. పీయూష్ చావ్లా ఒక వికెట్ పడగొట్టాడు.
BJP 5th List: బీజేపీ 5వ జాబితా రిలీజ్.. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌కి చోటు..