Rajesh Veeramalla
Author- NTV Telugu-
KKR vs RCB: కేకేఆర్ టార్గెట్ 183 పరుగులు.. రాణించిన విరాట్ కోహ్లీ
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు ఆర్సీబీ, కేకేఆర్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. కోల్ కతా ముందు ఓ ఫైటింగ్ స్కోరును నమోదు చేశారు. ఆర్సీబీ బ్యాటింగ్ లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో కూడా రాణించాడు. 59 బంతుల్లో 83 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. కోహ్లీ ఇన్నింగ్స్ లో 4 సిక్స్ లు, 4 ఫోర్లు ఉన్నాయి. -
IPL 2024: అత్యధిక సిక్సులు బాదిన ప్లేయర్స్ వీళ్లే..!
ఐపీఎల్ 2024 మెగా టోర్నీ ప్రారంభమై వారం రోజులు కావస్తుంది. మార్చి 21న మొదలైన ఐపీఎల్.. ఇప్పటికీ 9 మ్యాచ్ లు పూర్తి చేసుకోగా.. 10వ మ్యాచ్ జరుగుతుంది. ఇక.. ఈ ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ లోనూ ఆటగాళ్లు సిక్సర్ల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా.. ఇప్పటివరకు సన్ రైజర్స్ ప్లేయర్లు అత్యధిక సిక్సులు బాదారు. కేకేఆర్ తో ఆడిన మ్యాచ్ లో క్లాసెన్ సిక్స్ ల మీద సిక్స్ లు బాదాడు. అటు కేకేఆర్ బ్యాటర్ రస్సెల్ కూడా సిక్సర్ల సునామీ కురిపించాడు. -
Atrocious: కూలర్ను శుభ్రం చేయనందుకు కొడుకుపై తండ్రి కత్తితో దాడి..
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. కొడుకుపై తండ్రి కత్తితో దాడి చేసిన సంఘటన శివపురిలోని జవహర్ కాలనీలో జరిగింది. తాను చెప్పిన మాట విననందుకు కన్న కొడుకుపై కర్కశం చూపించాడు. కూలర్ ను శుభ్రం చేయమని చెప్పిన తండ్రి.. కుమారుడు మాట వినకపోవడంతో కోపంతో కర్రలతో కొట్టాడు. అంతటితో ఆగకుండా.. తండ్రి కొడుకుపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనను చూసిన తన కొడుకును రక్షించబోయిన తల్లిని, మరో కుమారుడిని కూడా చితక బాదాడు. -
Tom Moody: అతను చాలా డేంజరస్ క్రికెటర్.. డగౌట్లో ఎందుకు కూర్చోబెట్టారు..?
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ ప్లేయర్ పృథ్వీ షా గురించి తెలియని వారుండరు. క్రీజులో ఉన్నంతసేపు ఫోర్లు, సిక్స్ లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతాడు. అలాంటిది.. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో అతను మ్యాచ్ ల్లో కనపడటం లేదు. కేవలం డగౌట్ కే పరిమితమయ్యాడు. అతని స్థానంలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన యువ ఆటగాడు రికీ భుయ్ కు అవకాశం కల్పించారు. -
KKR vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్..
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు కోల్కతా నైట్రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7.30 గం.లకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన కోల్కతా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కాగా.. కేకేఆర్ ఒక్క మ్యాచ్ ఆడి గెలువగా.. ఆర్సీబీ రెండు మ్యాచ్ ల్లో ఒక్క మ్యాచ్ లో గెలిచింది. -
USA Cricket Team: USA క్రికెట్ జట్టులో హైదరాబాద్ అమ్మాయికి చోటు..
అమెరికా మహిళల జాతీయ క్రికెట్ జట్టులో హైదరాబాద్ కు చెందిన ఇమ్మడి సాన్వికి స్థానం లభించింది. యూఏఈలో జరగనున్న ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ లో ఆమె అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. కాగా.. 2020లో యూత్ క్రికెట్ అసోసియేషన్ కాలిఫోర్నియా తరఫున సాన్వి అరంగేట్రం చేసింది. సాన్వి రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్ ఆల్ రౌండర్. క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన నాలుగేళ్లలోనే ఆమె జాతీయ జట్టుకు ఆడబోతోంది. -
RR vs DC: అంఫైర్తో పాంటింగ్, గంగూలీ వాగ్వాదం.. కాసేపు ఆగిన మ్యాచ్.. ఇంతకీ ఏమైందంటే..!
ఐపీఎల్ 2024లో భాగంగా.. రాజస్థాన్-ఢిల్లీ మధ్య గురువారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 184 పరుగులు చేసింది. రాజస్థాన్ తరుఫున రియాన్ పరాగ్ (84) పరుగులు చేసి జట్టుకు స్కోరును అందించాడు. కాగా.. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. రెండు బంతులు పడగానే ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్, క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో.. కాసేపు మ్యాచ్ ను నిలిపివేశారు. -
Steve Smith: ప్రపంచంలో అతనే బెస్ట్ ప్లేయర్.. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ కీలక వ్యాఖ్యలు
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2024లో స్టార్ స్పోర్ట్స్ కామేంటేటర్ గా వ్యవహరిస్తున్న అతను.. వరల్డ్‌క్రికెట్‌లో ఎవరు బెస్ట్ క్రికెటర్ అన్నది చెప్పాడు. గురువారం జరిగిన రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రీ మ్యాచ్ షోలో పాల్గొన్న స్టీవ్ స్మిత్ కు ఓ ప్రశ్న ఎదురైంది. -
Ravindra Jadeja: వదిన తర్వాత నేనే అయి ఉంటాను.. ధోనీ తనను ఎత్తుకోవడంపై జడ్డూ వ్యాఖ్యలు
గత ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్స్ లో తలపడ్డాయి. అయితే.. ఆ మ్యాచ్ ను విజేతగా నిలపడంలో రవీంద్ర జడేజా ఆడిన ఆటతీరు వల్లే.. చివరి ఓవర్ లో జడేజా బౌండరీలు కొట్టి ఫైనల్ లో గెలిపించాడు. దీంతో.. ఎంఎస్ ధోనీ ఆలింగనం చేసుకుని.. పైకి ఎత్తుకున్నాడు. కాగా.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.. -
Sunil Narine: చరిత్ర సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో..
చరిత్ర సృష్టించేందుకు కేకేఆర్ స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ సునీల్ నరైన ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. ఈరోజు ఆర్సీబీతో జరిగే మ్యాచ్ లో ఆ ఫీట్ సాధించనున్నాడు. ఈ మ్యాచ్ తో టీ20ల్లో 500 మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా నిలువబోతున్నాడు. కాగా.. ప్రపంచ క్రికెట్ లో ఈ ఫీట్ ముగ్గురు మాత్రమే సాధించారు. కాగా.. ఈరోజు జరగబోయే మ్యాచ్ లో సునీల్ నరైన్ నాలుగోవాడు కానున్నాడు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!