ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నె సూపర్ కింగ్స్ గెలుపొందింది. 63 పరుగుల తేడాతో గుజరాత్ పై సీఎస్కే విజయం సాధించింది. కాగా.. గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో చెన్నై బౌలర్ల దాటికి గుజరాత్ బ్యాటర్లు చేతులెత్తేశారు. గుజరాత్ బ్యాటింగ్ లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన వృద్ధిమాన్ సాహా (21), శుభ్ మాన్ గిల్ (8) పరుగులతో నిరాశపరిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన సాయి సుదర్శన్ (37) పరుగులతో కాస్త పర్వాలేదనిపించినా.. పతిరాన బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత విజయ్ శంకర్ (12), డేవిడ్ మిల్లర్ (21), అజ్మతుల్లా ఒమర్జాయ్ (11) పరుగులు చేశారు. రాహుల్ తెవాటియా (6), రషీద్ ఖాన్ (1), ఉమేష్ యాదవ్ (10), స్పెన్సర్ జాన్సన్ (5) పరుగులు చేశారు. చెన్నై బౌలింగ్ లో దీపర్ చాహర్, ముస్తిఫిజుర్ రెహమన్, తుషార్ దేశ్ పాండ్ తలో రెండు వికెట్లు తీశారు. డారెల్ మిచెల్, మతీషా పతిరానా చెరో వికెట్ తీశారు.
MLA Rammohan Reddy : సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడు
మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 206 పరుగులు సాధించింది. చెన్నై బ్యాటింగ్ లో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (46), రచిన్ రవీంద్ర (46) పరుగులతో రాణించారు. ఆ తర్వాత అజింక్యా రహానే (12) పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన శివం దూబే గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 23 బంతుల్లో 51 పరుగులు చేశాడు. 2 ఫోర్లు, 5 సిక్స్ లతో గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. డారిల్ మిచెల్ (24), సమీర్ రిజ్వీ (14), రవీంద్ర జడేజా (7) పరుగులు చేయడంతో చెన్నై భారీ స్కోరు నమోదు చేసింది. ఇక.. గుజరాత్ బౌలింగ్ లో రషీద్ ఖాన్ 2 వికెట్లు తీయగా.. సాయి కిషోర్, స్పెన్సర్స్ జాన్సన్, మోహిత్ శర్మ తలో వికెట్ సంపాదించారు. ఈ గెలుపుతో చెన్నై వరుసగా రెండో గెలుపును నమోదు చేసుకుంది. రేపు (బుధవారం) సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ ఉండనుంది.
Sonam Wangchuk: లడఖ్ రాష్ట్రహోదా.. 21 రోజుల నిరాహారదీక్ష విరమించిన సోనమ్ వాంగ్‌చుక్..