ప్రతి వ్యక్తి తమ చర్మం యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. అందు కోసం ప్రజలు అనేక రకాల చికిత్సలు తీసుకుంటారు. బ్యూటీ పార్లర్లకు వెళ్లి రకరకాల చర్మ సంరక్షణ ఉత్పత్తులను వాడుతుంటారు. కానీ చాలాసార్లు ఆశించిన ఫలితాలు రావు. తినే ఫుడ్ విషయంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ఎక్కువగా చర్మ సంబంధింత సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే.. మీ చర్మం యవ్వనంగా కనిపించాలంటే కొన్ని మంచి ఆహారాలను తినడం మంచిది.
బీహార్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మోతీహరిలో భార్య, ముగ్గురు పిల్లలను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు భర్త ఇద్దుమియాన్. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు.. వారిని హత్య చేసి ఇంటి నుండి పారిపోయాడు. అయితే.. నిందితుడు ఇద్దును పట్టుకున్న వారికి మోతిహరి పోలీసులు రూ. 15,000 రివార్డు ప్రకటించారు. అందుకోసం నేరస్థుడిని పట్టుకునేందుకు పోలీసులు అన్ని చోట్లా గాలింపు చర్యలు చేపట్టారు.
వింజమూరు మండల కేంద్రంలో శుక్రవారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్యం కోసం తలపెట్టిన ప్రజాగళం దద్దరిల్లింది. ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో.. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల నుండి తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు, బీజేపీ నాయకులు, మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రజాగళం సభకు తరలివచ్చారు. ఇసుక వేస్తే రాలని జనం చంద్రబాబు ప్రసంగానికి జేజేలు పలికారు. చంద్రబాబు నాయుడు మాటలు ఆసక్తిగా విన్నారు. జాబు కావాలంటే బాబు రావాలన్నారు. పెద్ద ఎత్తున టీడీపీకి అనుకూలంగా నినాదాలు…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఆడిన ఒక్క మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.. అయితే.. ఇక నుంచి గెలుపు బాటలు వేసేందుకు లక్నో కీలక నిర్ణయం తీసుకుంది. డేవిడ్ విల్లే స్థానంలో న్యూజిలాండ్ సీమర్ మ్యాట్ హెన్రీని తీసుకున్నట్లు ప్రకటించింది. అయితే.. ఐపీఎల్ 2024 వేలంలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ డేవిడ్ విల్లేను లక్నో సూపర్ జెయింట్స్.. రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది.
మద్యం తాగొద్దని చెప్పినందుకు తన కుమారుడిని దుండగులు హత్య చేశారని ఓ తల్లి ఆరోపిస్తుంది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. జహంగీర్‌పురిలో దుండగులు 19 ఏళ్ల యువకుడిని కత్తితో పొడిచి చంపారు. వివరాల్లోకి వెళ్తే.. మద్యం తాగవద్దని యువకుడి తల్లి కొందరు అగంతకులకు చెప్పింది. దీంతో.. కోపోద్రిక్తులైన దుండగులు ఆమె కొడుకును చంపేశారు.
మహిళలు వంటగదికే పరిమితం అవ్వాలన్న కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే శివశంకరప్ప వ్యాఖ్యలపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మండిపడ్డారు. అమ్మాయిలు పోరాడగలరనే పార్టీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదు. నేను భారత్ కు పతకాలు సాధించినప్పుడు కాంగ్రెస్ ఏం ఆలోచించి ఉంటుంది..? ప్రధాని మోడీ నేతృత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చినా.. స్త్రీద్వేష వ్యక్తుల నుంచి అవమానం జరుగుతోంది. ఇది నిజంగా బాధాకరం అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
మహిళా ఇన్‌స్పెక్టర్‌తో ఓ బడా వ్యాపారవేత్త వాగ్వాదానికి పాల్పడ్డ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటు చేసుకుంది. నిబంధనలు ఉల్లంఘించి పోలీసులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాగా.. మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్, వ్యాపారవేత్త మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు అతనిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో కింగ్ కోహ్లీ రికార్డుల సునామీ సృష్టించాడు. కేకేఆర్ తో మ్యాచ్ లో 83 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.. కాగా.. ఆ పరుగులతో మరో వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒకే వేదికలో అత్యధిక టీ20 రన్స్ (3,276) చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. అయితే.. ఇంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం పేరిట ఉండేది. అతను మీర్పూర్ వేదికగా ఇప్పటివరకు…
పాకిస్తాన్ టీ20 కెప్టెన్ షాహీన్ షా అఫ్రిదీ తన కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం తెలుస్తోంది. కాగా.. తన కెప్టెన్సీలో పాకిస్తాన్ ఘోర ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ.. ఆయన వైదొలుగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయనకు పీసీబీ (PCB) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. పాకిస్తాన్ కెప్టెన్ గా మళ్లీ బాబర్ ఆజమ్ పగ్గాలు చేపట్టనున్నట్లు సమాచారం. న్యూజిలాండ్ తో జరగబోయే టీ20 సిరీస్ కు ఆయనకు బాధ్యతలు అప్పజెప్పనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘోర పరాజయం పాలైంది. 7 వికెట్ల తేడాతో కోల్ కతా గెలుపొందింది. 183 పరుగుల లక్ష్యాన్ని 16.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే.. ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు హోంగ్రౌండ్ లో ఆడిన ఏ జట్టూ ఓడిపోలేదు. కానీ.. ఈరోజు కేకేఆర్ తో చేతిలో ఓటమి చెందింది.