ఐపీఎల్ 2024లో భాగంగా.. ఆడిన ఒక్క మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.. అయితే.. ఇక నుంచి గెలుపు బాటలు వేసేందుకు లక్నో కీలక నిర్ణయం తీసుకుంది. డేవిడ్ విల్లే స్థానంలో న్యూజిలాండ్ సీమర్ మ్యాట్ హెన్రీని తీసుకున్నట్లు ప్రకటించింది. అయితే.. ఐపీఎల్ 2024 వేలంలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ డేవిడ్ విల్లేను లక్నో సూపర్ జెయింట్స్.. రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది.
Read Also: Delhi: మద్యం తాగొద్దని చెప్పిన తల్లి.. తన కొడుకును బలి తీసుకున్న దుండుగులు
అయితే.. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2024లో ఆడటం లేదు. ఈ క్రమంలో.. లక్నో సూపర్ జెయింట్స్ న్యూజిలాండ్ ఫాస్ట్‌బౌలర్ మ్యాట్ హెన్రీని జట్టులోకి తీసుకున్నారు. రూ. 1.25 కోట్ల కనీస ధరకు అతడిని సొంతం చేసుకుంది. మ్యాట్ హెన్రీ.. న్యూజిలాండ్ తరఫున 2014లో అంతర్జాతీయ క్రికెట్ లో ప్రవేశించాడు. ఇప్పటి వరకు 25 టెస్ట్ లు, 82 వన్డేలు, 17 టీ20 మ్యాచ్ లు ఆడాడు. మ్యాట్ హెన్రీ.. గతంలో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు.
Read Also: Love Me: ‘రావాలి రా ‘ అంటున్న దెయ్యాల ప్రేమ గీతం..
ఇక.. టీ20 ఫార్మాట్ లో ఓవరాల్‌గా 131 మ్యాచ్‌లు ఆడగా.. 151 వికెట్లు పడగొట్టాడు. ఇక.. ఈ సీజన్ లో బోణీ కొట్టని లక్నో.. మ్యాట్ హెన్రీ ఎంట్రీతో పేస్ దళం బలం అవుతుందని చెప్పవచ్చు. కాగా.. ఈరోజు లక్నో, పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.