Virat Kohli: కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో కింగ్ కోహ్లీ రికార్డుల సునామీ సృష్టించాడు. కేకేఆర్ తో మ్యాచ్ లో 83 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.. కాగా.. ఆ పరుగులతో మరో వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒకే వేదికలో అత్యధిక టీ20 రన్స్ (3,276) చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. అయితే.. ఇంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం పేరిట ఉండేది. అతను మీర్పూర్ వేదికగా ఇప్పటివరకు 3,239 పరుగులు చేశాడు. అయితే ఆ రికార్డును కోహ్లీ దాటేశాడు. ఇదిలా ఉంటే..ముష్ఫికర్ రహీం రెండో స్థానానికి పడిపోగా.. మూడు, నాలుగు స్థానాల్లో ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్, బంగ్లా ప్లేయర్ తమీమ్ ఇక్బాల్ ఉన్నారు. ట్రెంట్ బ్రిడ్జి వేదికపై హేల్స్ 3,036 పరుగులు చేయగా.. మీర్పూర్ వేదికగా తమీమ్ 3,020 పరుగులు చేశాడు.
Read Also: Shaheen Afridi: కెప్టెన్సీకి అఫ్రిదీ గుడ్ బై..?
Also Read
మరోవైపు.. శుక్రవారం కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ మరో రికార్డు సాధించాడు. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరఫున అత్యధిక సిక్సులు (241) కొట్టిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ (239) పేరిట ఉండేది. అతడు కూడా ఆర్‌సీబీ తరఫున 239 సిక్సులు బాదాడు. గేల్ తర్వాతి స్థానాల్లో ఏబీ డివిలియర్స్ (ఆర్‌సీబీ -238), కీరన్ పొలార్డ్ (ఎంఐ-221), రోహిత్ శర్మ (ఎంఐ-210) ఉన్నారు.
Read Also: YSRCP: వైసీపీలోకి కళ్యాణ దుర్గం టీడీపీ ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు
ఇదిలా ఉంటే.. నిన్నటి మ్యాచ్ లో 83 రన్స్ చేసిన విరాట్ కోహ్లీ.. మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కోల్ కతాపై అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఇప్పటివరకు కోల్‌కతాపై 33 మ్యాచులు ఆడిన కోహ్లీ 944 రన్స్ సాధించాడు. కాగా.. ఇంతకుముందు మూడో స్థానంలో 907 పరుగులతో శిఖర్ ధావన్ ఉండగా… అతడిని దాటేశాడు. కాగా.. ఈ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో డేవిడ్ వార్నర్ (1075), రోహిత్ శర్మ (1040) ఉన్నారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!