ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్ టైటాన్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ లో లక్నో ఘన విజయం సాధించింది. 33 పరుగుల తేడాతో గెలుపొందింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. 18.5 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది. గుజరాత్ బ్యాటింగ్ లో సాయి సుదర్శన్ (31) అత్యధిక పరుగులు చేశాడు. ఆ తర్వాత శుభ్ మాన్ గిల్ (19), విలియమ్సన్ (1), శరత్ (2), విజయ్ శంకర్ (17), నాల్కండే (12), చివరలో రాహుల్ తెవాటియా (30) పరుగులు చేశాడు. రషీద్ ఖాన్ డకౌట్ కాగా.. ఉమేష్ యాదవ్ (2) పరుగులు చేశారు. లక్నో బౌలింగ్ లో యష్ ఠాకూర్ 3.5 ఓవర్లు వేసి 5 వికెట్లు తీశాడు. అందులో ఒక మెయిడిన్ ఓవర్ ఉంది. ఆ తర్వాత కృనాల్ పాండ్యా 3 వికెట్లతో విరుచుకుపడ్డాడు. నవీన్ ఉల్ హక్, రవి బిష్ణోయ్ తలో వికెట్ సంపాదించారు.
Read Also: Himachal Pradesh: ఘోర ప్రమాదం.. ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడి ఒకరు మృతి, పలు వాహనాలు దగ్ధం
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. లక్నో బ్యాటింగ్ లో మార్కస్ స్టోయినీస్ అత్యధికంగా (58) పరుగులు చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్ (33), చివరలో నికోలస్ పూరన్ (32) పరుగులు చేశారు. కాగా.. ఈ మ్యాచ్ లో కూడా డికాక్ మరోసారి నిరాశపరిచాడు. 6 పరుగులు చేసి ఔటయ్యాడు. పడిక్కల్ (7), ఆయూష్ బదోని (20), కృనాల్ పాండ్యా (2) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో ఉమేష్ యాదవ్, దర్శన్ నాల్కండే తలో రెండు వికెట్లు తీశారు. ఆ తర్వాత రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు.
Read Also: Maa Elections: మరోసారి మా అధ్యక్షుడిగా మంచు విష్ణు.. ఏకగ్రీవంగా ఎన్నుకున్న కమిటీ..!