ఐపీఎల్ 2024లో భాగంగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలుపొంది. 197 పరుగుల లక్ష్యాన్ని 15.3 ఓవర్లలోనే చేధించింది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ కేవలం 19 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు మిస్టర్ 360. అతని ఇన్నింగ్స్ లో 4 సిక్స్ లు, 5 ఫోర్లు ఉన్నాయి. ఓపెనర్లు రోహిత్ శర్మ (38), ఇషాన్ కిషన్ (69) శుభారంభాన్ని అందించారు. ఈ క్రమంలో ముంబై…
కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ పై క్రిమినల్ కేసు నమోదు అయింది. రమణయ్య పేటలో తమను నిర్భంధించి దౌర్జన్యం చేశారని వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. నానాజీ పై Cr.no 267/2024 U/s 143, 454, 341, 342, 506 R/w 149 IPC సెక్షన్ల కింద సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు చేసింది. ముంబై ముందు 197 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. కాగా.. ఈ మ్యాచ్ లో కెప్టెన్ డుప్లెసిస్ (61), చివరలో దినేష్ కార్తీక్ (53), రజత్ పాటీదార్ (50) పరుగులతో రాణించడంతో బెంగళూరు భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన కోహ్లీ (3) పరుగులు…
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. సీఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. అందాల సీమను కలహాల సీమగా మార్చాడని దుయ్యబట్టారు. మళ్లీ ఈ పరిస్థితులు రాకుండా కాపాడుతామని పవన్ తెలిపారు. జగన్.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలుపరచలేదని ఆరోపించారు. మళ్లీ వైసీపీ ఎన్నికల ప్రచారానికి వస్తే నిలదీయండని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హాయంలో రైతులు క్రాఫ్…
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో రేపు(శుక్రవారం) కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో ఏప్రిల్ 17 నుండి 25వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికే టీటీడీ (TTD) అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ సందర్భంగా రేపు తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలుపుతారు. అనంతరం ఉదయం 8 నుండి 11.30 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. నేడు ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య బిగ్ ఫైట్ జరుగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై.. మొదటగా ఫీల్డింగ్ ఎంచుకుంది. వాంఖడేలో స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యా్చ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే.. ముంబై ఇండియన్స్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లో.. కేవలం ఒక్క మ్యాచ్లోనే విజయం సాధించింది. అటు.. ఆర్సీబీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఐదు మ్యాచ్లు ఆడిన బెంగళూరు.. కేవలం ఒక్క మ్యాచ్లోనే విజయం సాధించింది. ఈ క్రమంలో.. నాలుగు మ్యాచ్లు ఓడిపోయి 9వ…
నేడు ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా బిగ్ ఫైట్ జరగనుంది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా గెలిచిన ముంబై ఇండియన్స్ వారి సొంత మైదానమైన వాంఖడేలో స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడుతుంది. ముంబై ఇండియన్స్ ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో.. ఒక్క మ్యాచ్ లో విజయం సాధించింది. మిగతా మ్యాచ్ లు ఓటమి పాలైంది. ఈ క్రమంలో.. జట్టు విజయం కోసం పరితపిస్తుండగా.. ఓ యువ ఆటగాడిని రంగంలోకి దింపుతుంది. విష్ణు వినోద్ స్థానంలో హార్విక్ దేశాయ్ జట్టులోకి రానున్నాడు.
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జట్టులోని గీత, సీత పేర్ల గురించి తెలిపారు. ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ భారత జట్టులోని సీత-గీత అని అన్నారు. వారిద్దరు ప్రతి పనిని కలిసి చేయడానికి ఇష్టపడతారని కోహ్లీ చెప్పారు. ఈ యువ ఆటగాళ్లిద్దరూ గ్రౌండ్ లో ఉన్నప్పుడు వీరి మధ్య ప్రత్యేక సంబంధం, సోదర భావం ఉంటుందని తెలిపారు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్, డాషింగ్ ఓపెనర్ ఒకరికొకరు చాలా ఇష్టపడతారన్నారు. ఇటీవలి కాలంలో వీరిద్దరూ టీమిండియాకు వివిధ ఫార్మాట్లలో ఆడారు.…
కూటమిలో టికెట్ల కేటాయింపుల పంచాయితీ కొనసాగుతూనే ఉంది. టికెట్ కోసం ఆశావహులు రచ్చకెక్కుతున్నారు. ఈ క్రమంలో మన్యం జిల్లా పాలకొండ జనసేన పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఇంచార్జ్ జయకృష్ణకు వ్యతిరేకంగా పడాల భూదేవి వర్గం సమావేశం ఏర్పాటు చేశారు. కాగా.. మీడియా సమావేశంలో జనసేన నేత పడాల భూదేవి కన్నీటి పర్యంతమయ్యారు. టికెట్ ఇస్తామని చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మాట తప్పారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చివరి క్షణంలో జయకృష్ణకు టికెట్ కేటాయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏపీలో కరెన్సీ నోట్లకు రెక్కలొచ్చాయి. ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం ఉండటంతో పార్టీలు, అభ్యర్థులు స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో.. ఓటర్లను ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నారు. ఇన్నాళ్లు కలుగుల్లో దాచిపెట్టిన డబ్బులను బయటకు తీస్తున్నారు. బినామీల చేతుల మీదుగా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. అక్కడక్కడ తనిఖీల్లో దొరికిందే కొంత.. ఇంకా దొరకని సొమ్ము వందల కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎన్నికల్లో నగదు ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల కమిషన్ కూడా కొరడా ఝులిపిస్తుంది.