గుజరాత్లోని బనస్కాంత లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గనిబెన్ ఠాకోర్ భావోద్వేగానికి గురయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లడుతూ ఏడ్చారు. అంతకుముందు ఎంపీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసేందుకు భారీగా ట్రాక్టర్ల ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారు. అనంతరం సభలో మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గ ప్రజలు తనను పూల మాలలు వేస్తూ ఆశీర్వదిస్తున్నారంటూ ఏడ్చేసింది.
Read Also: CPI Ramakrishna: ఒక్క హామీని కూడా బీజేపీ అమలు చేయలేదు.. పెరిగిన ధరలపై ప్రజలు ఆలోచించాలి..!
గత నెలన్నర రోజులుగా తమ పార్లమెంట్ పరిధిలోని ప్రతి తాలుకాను తిరిగానని చెప్పారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనే లేనప్పటికీ.. తన అనుచరులు, కార్యకర్తలు, నాయకులు మీరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పారన్నారు. తమ వెంట మేమున్నామని, మీ విజయం కోసం శ్రమిస్తామని వారు చెప్పారన్నారు. ఈ క్రమంలో.. వారి మాట మీద తమ పార్లమెంట్ అభివృద్ధి కోసం తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
Read Also: Pawan Kalyan : అలా చేస్తే గులక రాయి విసిరిన చేయి వెనుక ఉన్నదెవరో బయటపడుతుంది!
సభను ఉద్దేశించి గనిబెన్ ఠాకూర్ మాట్లాడుతూ.. నేడు జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ సమస్యలపై పోరాడేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు. మరోవైపు.. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని అక్కడ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గోహత్యను నిషేధిస్తామని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు.. ఒకవైపు ప్రజల అధికారం, మరోవైపు డబ్బుతో జరుగుతున్నాయని గనిబెన్ ఠాకూర్ చెప్పారు. ఈ ఎన్నికల్లో తాను గెలిస్తే.. ఆ విజయం తన ఒక్కరిది కాదని.. తన 18 మంది సహచరులది పేర్కొన్నారు. బనస్కాంత స్వేచ్ఛ కోసం తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు ఆమె చెప్పారు.