కాంగోలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. తూర్పు కాంగోలోని గ్రామాలపై దాడి చేసి 11 మందిని చంపారు. అంతేకాకుండా.. కొన్ని వాహనాలను తగలబెట్టగా, మరికొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక అధికారులను ఉటంకిస్తూ.. (AP) వార్తా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఉగాండా సమీపంలోని సరిహద్దు ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ గ్రూపుతో సంబంధాలు కలిగి ఉన్న మిత్రరాజ్యాల డెమోక్రటిక్ ఫోర్సెస్ తిరుగుబాటుదారులు చాలా కాలంగా పనిచేస్తున్నారు.
Read Also: Abhishek Sharma: సిద్ధూ మూసేవాలాకు బిగ్ ఫ్యాన్ను.. నా ఆరాధ్యదైవం ఎవరో తెలుసా..?
కాగా.. ఈ ఘటన శనివారం రోజున జరిగింది. అందుకు సంబంధించిన సమాచారాన్ని స్థానిక మేయర్ ఆదివారం తెలిపారు. మేయర్ ఎన్‌గోంగో మయాంగా తెలిపిన వివరాల ప్రకారం.. ములకెర కమ్యూన్‌లోని నాలుగు వేర్వేరు ప్రదేశాల నుండి 11 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఉత్తర కివ్ ప్రావిన్స్‌లోని బెని పట్టణానికి సమీపంలో ములకేర ఉంది. కాగా.. ఈ ప్రాంతంలో ఈ ఏడాది జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో దాదాపు 200 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి ఇటీవలె వెల్లడించింది.
Read Also: Kunamneni Sambasiva Rao: బీజేపీ, కేసీఆర్ రైతు దీక్షలు చూసి సమాజం నవ్వుతుంది..
అక్కడ.. 120 కంటే ఎక్కువ సాయుధ సమూహాలు విలువైన ఖనిజ వనరుల నియంత్రణ కోసం పోరాడుతున్నాయి. కొన్ని తమ సంఘాలను రక్షించుకోవడం కోసం దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో.. తూర్పు కాంగోలో జరిగిన దాడులలో కాంగో సర్వ నాశనమైంది. అక్కడ తిరుగుబాటుదారులచే సామూహిక హత్యలు తరచుగా జరుగుతాయి. ఈ హింసాకాండ కారణంగా 7 మిలియన్ల మంది ప్రజలు తమ ఇళ్లను విడిచి పారిపోయారని యు.ఎన్ వెల్లడించింది.