Zee5 Upcoming Movies: జీ5 మెగా లైనప్ అనౌన్స్.. వెంకటేష్, బాలయ్య, నాగచైతన్య సినిమాలతో భారీ ప్లాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zee5 Upcoming Movies: ఓటీటీ పోటీ రోజురోజుకూ క్రేజీగా మారుతోంది. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు వరుసగా భారీ ప్రాజెక్ట్‌లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 బహుభాషా కంటెంట్ లైనప్‌ను అధికారికంగా ప్రకటించింది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలతో కూడిన ఈ జాబితాను చూస్తుంటే తెలుగు ప్రాజెక్టులపై ఓ కన్నేసినట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల డిజిటల్ హక్కులు జీ5 దక్కించుకోవడంతో టాలీవుడ్‌పై భారీ అంచనాలే పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.
ఈ లైనప్‌లో విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. అలాగే నందమూరి బాలకృష్ణ నటిస్తున్న NBK111, అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో రూపొందుతున్న వృషకర్మ చిత్రాలు కూడా Zee5లోనే స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రస్తుతం ఈ మూడు సినిమాలపై సినీ అభిమానుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. థియేటర్లలో విడుదల అనంతరం ఈ సినిమాలు ఓటీటీలో కూడా మంచి ఆదరణ పొందుతాయని జీ5 భావిస్తోంది.
Also Read
సినిమాలతో పాటు తెలుగు ఒరిజినల్ కంటెంట్‌పైనా సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టింది. చాలా కాలం తర్వాత నటి నివేదా థామస్ ఓటీటీకి తిరిగి వస్తున్న ‘శ్రీమతి’ వెబ్ సిరీస్‌ను అధికారికంగా ప్రకటించింది. అలాగే సీనియర్ నటుడు శ్రీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘అబ్జెక్షన్ మైలార్డ్’ కూడా జీ5 ఒరిజినల్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకప్పుడు మంచి ఆదరణ పొందిన టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్ము రా’ రెండో సీజన్‌తో తిరిగి వస్తుండటంతో ఆడియన్స్ కు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ను కళ్ళముందు ఉంచబోతోంది జీ5 ప్లాట్ ఫామ్.
తెలుగు మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ జీ5 భారీ కంటెంట్‌ను సిద్ధం చేసింది. హిందీలో వరుణ్ ధావన్ నటిస్తున్న ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’, బాబీ డియోల్ నటిస్తున్న ‘బందర్’, కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘భారత్ భాగ్య విధాత’, మృణాల్ ఠాకూర్ నటిస్తున్న ‘పూజా మేరీ జాన్’ వంటి ప్రాజెక్టులను కూడా ప్రకటించింది.
ఇక తమిళంలో ‘కూసే మునిసామి వీరప్పన్’, ‘తడయం’, ‘అనంతకాలం’, ‘థీ కురల్’, ‘డిమోంటే కాలనీ 3’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కన్నడ విభాగంలో ‘అయ్యనా మనే’ కొత్త సీజన్‌తో పాటు ‘ది ఒరిజినల్ బిట్‌కాయిన్ స్కామ్’, ‘ఆపరేషన్ బంగార’, రాజ్ బి శెట్టి నటిస్తున్న ‘కరవాలి’ ప్రాజెక్టులు కూడా చోటు దక్కించుకున్నాయి. ఇక మలయాళంలో ‘ఎ క్వీన్’, ‘మలబార్ కప్’, హిట్ చిత్రం ‘బాలన్ ది బాయ్’ స్ట్రీమింగ్ సిద్ధమయ్యాయి.
స్టార్ హీరోల సినిమాలు, విభిన్న భాషల్లో ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలతో జీ5 ఈసారి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా తెలుగు స్టార్ హీరోల సినిమాల ద్వారా డిజిటల్ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని జీ5 లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్‌లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..