సింగపూర్‌లో విధ్వంసం సృష్టించిన కోవిడ్ KP.2 , KP.1 కొత్త వేరియంట్లు.. ఇప్పుడు భారతదేశంలో వ్యాప్తి చెందుతున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం.. ఇండియాలో 290 KP.2 కేసులు, 34 KP.1 కేసులు నమోదయ్యాయి. అయితే.. ఇవి JN1 సబ్ వేరియంట్లు అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా.. కోవిడ్ కొత్త వేరియంట్లతో ఎలాంటి ప్రమాదం లేదని నివేదిక పేర్కొంది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరుగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
బీహార్లో దారుణం చోటు చేసుకుంది. రోజువారీగా పాఠశాలకు వెళ్తున్న టీచర్ పై ఓ వ్యక్తి పలుసార్లు కత్తితో దాడి చేశాడు. మెడపై తీవ్రంగా దాడి చేశాడు. ఆమె చనిపోయేంత వరకు కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున తూర్పు బీహార్‌లోని కతిహార్‌లో చోటు చేసుకుంది. టీచర్ యశోదా దేవి (29) మంగళవారం ఉదయాన్నే లేచి దేవుడికి పూజలు చేసి.. అనంతరం పాఠశాలకు బయలుదేరిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
ఉత్తరాఖండ్లో గంజాయి స్మగ్లింగ్ బ్లాక్ వ్యాపారాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. మంగోలి ప్రాంతంలో 31.99 గ్రాముల గంజాయి తరలిస్తున్న బరేలీకి చెందిన స్మగ్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రీ వెడ్డింగ్ వేడుకను రీసెంట్గా చాలా ఘనంగా జరిపారు. కాగా.. తాజాగా పెళ్లి వేడుకలను మొదలుపెట్టారు. వివాహ వేడుకలు మే 29న ఇటలీలో ప్రారంభమై జూన్ 1 వరకు జరుగనున్నాయి. ఈ వేడుకలు స్విట్జర్లాండ్‌లో ముగియనున్నాయి. అయితే.. ఈ వివాహ వేడుకకు బాలీవుడ్, అంతర్జాతీయ ప్రముఖులు ఎంతో మంది అతిరథ మహారథులు హాజరుకానున్నారు.
గుజరాత్‌లోని బోర్తలావ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈరోజు మధ్యాహ్నం ఆరుగురు చిన్నారులు నీటిలో మునిగిపోయారు. ఈ ప్రమాదంలో ఐదుగురు బాలికలు, ఒక బాలుడు ఉన్నారు. పిల్లలంతా స్థానిక ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అయితే.. బట్టలు ఉతకడం కోసమని.. స్నానానికి చెరువుకు వెళ్లారు. ఈ క్రమంలో చెరువులోకి దిగడంతో చిన్నారులు నీటిలో మునిగి పోయారు.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ ఉపాధ్యాయుడు తన ఇంట్లో సమస్యలను దూరం చేసుకోవాలనుకున్నాడు. పరిష్కారం కోసం ఒక తాంత్రికుడి వద్దకు వెళ్లాడు. అయితే.. ఆ తాంత్రికుడు తన ఆస్తులన్నీ కాజేశాడు. దీంతో.. బాధితుడు ఆస్తులు, తన కుటుంబాన్ని రెండింటిని కోల్పోయాడు. కాగా.. ఈ ఘటనలో బాధితుడు భార్య సుష్మా దేవదా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాంత్రికుడు, అతని కుమారుడు సహా నలుగురిపై కేసు పెట్టింది. ఈ వ్యవహారం 2023లో మొదలు కాగా.. పోలీసులు విచారణ చేపట్టారు.
ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లోని ఖరేవాన్ సరయ్మీర్‌లో సమాజ్వాద్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సమావేశానికి కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. అయితే.. పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అభివాదం అనంతరం ప్రసంగాన్ని ప్రారంభించేందుకు లేవగానే కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగి సభా వేదిక వద్ద తొక్కిసలాట జరిగింది. ఒక్కసారిగా కార్యకర్తలు వేదికపైకి వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే వెంటనే పోలీసులు వారిని అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కొద్దిసేపటి తర్వాత ప్రశాంత వాతావరణం ఏర్పడింది.
ఈశాన్య ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై సిరా విసిరిన నిందితుడు అజయ్‌కుమార్ (41)ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు నార్త్ ఈస్ట్ డీసీపీ జాయ్ టిర్కీ సమాచారం అందించారు. కాగా.. మే 17న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో కన్హయ్య కుమార్‌పై ఇంక్ విసిరి, చెంపదెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. కొందరు వ్యక్తులు కన్హయ్యకు పూలమాల వేస్తానన్న సాకుతో వచ్చి చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించారు.
పెద్ద పెద్ద నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అవుతుంది. ఇక వర్షం పడితే అంతే సంగతులు.. అక్కడే ఉండిపోవాల్సందే. అలాంటప్పుడు అనిపిస్తుంది. గాల్లో ఎగిరిపోతే బాగుండు అని.. ఇప్పుడు ఆ కళ నిజమైంది. అమెరికాకు చెందిన లిఫ్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ హెక్సా పేరిట ఒక ఎగిరే కారును రెడీ చేసింది. దీనిని చూస్తే.. అచ్చి పెద్ద డ్రోన్ లా కనిపిస్తుంది. కానీ.. ఈ కారులో కూర్చుని హాయిగా ఎగిరి వెళ్లిపోవచ్చు. ఇటీవల జపాన్‌లోని టోక్యోలో ఈ ఎగిరే కారు ‘హెక్సా’ను ప్రదర్శించారు. పది, పన్నెండు…