నోయిడాలో ఇంతకుముందు 8వ తరగతి చదువుకునే విద్యార్థుల వరకు మూసివేయాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ ఎండ తీవ్రత దృష్ట్యా 12వ తరగతి వరకు మూసివేయనున్నారు. కాగా.. ఈ ఆర్డర్ అన్ని బోర్డు పాఠశాలలకు వర్తిస్తుందని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా స్కూల్ ఇన్‌స్పెక్టర్ ధరమ్‌వీర్ సింగ్ తెలిపారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ ఉత్తర్వును పాటించాలని కోరారు.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) ఆదివారం హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై ప్రధాని మోడీతో సహా.. ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే రైసీకి నివాళిగా భారత్‌లో (రేపు) మే 21న ఒక రోజు సంతాప దినం పాటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా జాతీయజెండాను అవనతం చేయడంతో పాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. 1989లో ఇరాన్ తొలి సుప్రీం లీడర్ అయతొల్లా రుహోల్లా ఖొమేనీ మరణించిన…
ప్రేమించే ముందు ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రేమిస్తారు. ప్రేమించిన తర్వాత.. అడ్డు తొలగించుకోవడానికి ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. అందుకే ప్రేమించే ముందే.. భవిష్యత్ గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ప్రేమించాలి. అయితే తాజాగా.. ప్రేమించిన ప్రియుడిని కాదనుకునేందుకు హత్య చేసింది ప్రియురాలు. ఈ ఘటన హర్యానాలోని తిక్రీ గ్రామంలో చోటు చేసుకుంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించి ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను విచారించగా అసలు విషయం బయటపడింది.
సార్వత్రిక ఎన్నికల ఐదవ దశలో భాగంగా.. సోమవారం 49 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. కాగా.. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. అన్నీ చోట్ల ఎలాంటి ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. కాగా.. సాయంత్రం 5 గంటల వరకు 56.68 శాతం పోలింగ్ నమోదైంది. ఇదిలా ఉంటే.. ఓ యువ ఓటర్.. ఎనిమిది సార్లు ఓటు వేశాడు. అంతేకాకుండా.. తాను ఓటేసే వీడియోను రికార్డు చేశాడు. అయితే.. ఈ వీడియో బయటకు రావడతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమితో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం పన్స్కురాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న దీదీ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తమ పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కు అత్యధిక సీట్లు వస్తే.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే భారత కూటమికి పూర్తిగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
దేశంలో ఐదవ దశ లోక్‌సభ ఎన్నికలు కాసేపటి క్రితమే ముగిశాయి. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు పోలింగ్ కొనసాగింది. అయితే.. ఉత్తర ప్రదేశ్ లోని రెండు గ్రామాలు, జార్ఖండ్‌లో ఒక గ్రామ ప్రజలు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. దీనికి కారణమేంటని ఆరా తీయగా.. తమ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేదని.. అందుకే తాము ఓటు వేయడం లేదని తెలుపుతున్నారు. తమ గ్రామ అభివృద్ధి గురించి పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఒడిశాలో పర్యటించారు. ఈ సందర్భంగా.. పూరీలోని ప్రసిద్ధ జగన్నాథ ఆలయంలో ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ.. “పూరీలో మహాప్రభు జగన్నాథుడిని ప్రార్థించాను. ఆయన ఆశీర్వాదం ఎల్లప్పుడూ మాపై ఉండాలి మరియు మమ్మల్ని పురోగతి యొక్క కొత్త శిఖరాలకు తీసుకువెళ్లాలని" తెలిపారు. పూజలు నిర్వహించిన తర్వాత.. మార్చికోట్ చౌక్ నుండి పూరీలోని మెడికల్ స్క్వేర్ వరకు రెండు కిలోమీటర్ల రోడ్ షోలో పాల్గొన్నారు. బీజేపీ పూరీ లోక్‌సభ అభ్యర్థి సంబిత్ పాత్రతో కలిసి రోడ్ షో…
అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను గుజరాత్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ నలుగురు ఉగ్రవాదులు శ్రీలంకకు చెందిన వారు కాగా.. వారు హింసను సృష్టించడానికి ముఖ్యమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకునే పనిలో ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులను మహ్మద్ నుస్రత్, మహ్మద్ నఫ్రాన్, మహ్మద్ ఫారిస్, మహ్మద్ రస్దీన్‌లుగా గుర్తించారు.
ఒడిశాలో మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒడిశా పోలీస్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సభ్యుడికి గాయాలయ్యాయి. గరియాబంద్ జిల్లా చివరిలో ఉన్న కొమ్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని సునాబేడా అభయారణ్యంలో అర్థరాత్రి ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో క్రాస్ ఫైరింగ్‌లో సైనికుడి మెడపై కాల్పులు జరిగాయి. దీంతో.. జవాన్ కు తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే అతన్ని గరియాబంద్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అందించారు. అనంతరం సైనికుడిని రాయ్‌పూర్‌కు రెఫర్ చేశారు. గాయపడిన సైనికుడి…
బీజేపీ తరుఫున మండి లోక్సభ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంగనా రనౌత్ కు నిరసన సెగ తగిలింది. సోమవారం హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్-స్పితి లోయలో ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లింది. ఈ క్రమంలో.. అక్కడి ప్రజలు 'గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. అంతేకాకుండా.. కంగనా రనౌత్, ప్రతిపక్ష నేత జైరాం ఠాకూర్‌ల కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఓ బీజేపీ కార్యకర్త గాయపడ్డాడు. కంగనా గో బ్యాక్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.