వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ.. కొత్తగూడెం, కొత్తగూడెం క్లబ్లోని ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ జాతీయ నాయకులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ఫ్లెయింగ్ స్కాడ్ పేరుతో తమకు ఇబ్బందులు గురిచేయాలని చూశారని ఆరోపించారు. లక్ష కోట్ల యజమాని అయిన గుడిసెల్లో ఉన్న వారికైనా ఒకటే ఆయుధం ఓటు అని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తూట తిన్నది ఇక్కడి ప్రజలేనని.. ఈ జిల్లా పెద్ద చైతన్య వంతమైన జిల్లా…
దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో.. జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజస్థాన్‌లోని బార్మర్‌లో 48.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనేక ప్రాంతాల్లో వేడిగాలులు వీచాయి. కాగా.. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు దేశంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్‌లలోని కనీసం 16 ప్రదేశాలలో గురువారం గరిష్టంగా 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేడి గాలులు కనీసం ఐదు రోజుల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది.
కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. రుతుపవనాలకు ముందు కురుస్తున్న వర్షాలతో కేరళ అతలాకుతలం అవుతోంది. ఈ క్రమంలో.. రాష్ట్రంలోని ఎర్నాకులం, త్రిసూర్‌లలో రెడ్ అలర్ట్.. పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్ మరియు వాయనాడ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రెడ్ అలర్ట్ ప్రాంతాల్లో రానున్న 24 గంటల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా.. భారీ నుండి అతి భారీ వర్షం కురిసే అవకాశం…
గ్రామంలో పలుకుబడి ఉన్న ఓ వ్యక్తి కుమార్తె వివాహంలో కొందరు వ్యక్తులు రచ్చ చేశారు. సరదాగా డీజే పాటలకు డ్యాన్స్ చేస్తున్న వధువు తరఫు మహిళలతో కలిసి కొందరు పోకిరీలు మధ్యలో వచ్చి వారితో బలవంతంగా డ్యాన్స్ చేయించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో.. ఓ మహిళ నేలపై పడిపోయింది. అయితే.. పక్కనున్న కొంతమంది గమనించి వారిని అక్కడి నుంచి పంపించారు. అంతటితో ఆగకుండా.. పోరంబోకులు వివాహ ఊరేగింపుపై దాడి చేశారు. పెళ్లికి వచ్చిన బంధువులను కర్రలతో వెంబడించి మరీ కొట్టారు. అంతేకాకుండా.. కాల్పులు కూడా…
బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. యూనిఫాం ధరించకుండ పాఠశాలకు వచ్చిన 6వ తరగతి విద్యార్థిని చితకబాదాడు హెడ్ మాస్టర్. తీవ్రంగా కొట్టడంతో వీపుపై పెద్దపెద్ద గాయాలయ్యాయి. ఈ ఘటనలో ప్రధానోపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తన భార్యను, ప్రేమికుడిని ఓ చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన రాజస్థాన్‌లోని బన్స్వారాలో చోటు చేసుకుంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. అయితే.. భర్తను అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
ఆరో దశ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీహార్‌లోని ఎనిమిది స్థానాలకు శనివారం ఏకకాలంలో పోలింగ్ జరగనుంది. వీటిలో కొన్ని సీట్లు నేపాల్, ఉత్తరప్రదేశ్ సరిహద్దులకు ఆనుకుని ఉన్నాయి. ఈ క్రమంలో నేపాల్, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో నిఘా పెంచారు. 60 వేల మందికి పైగా భద్రతా బలగాలను మోహరించారు. దీంతో పాటు ఎన్నికల విధులకు 18 వేల మందికి పైగా హోంగార్డులను కూడా నియమించారు. చాప్రాలో ఎన్నికల హింసాకాండ అనంతరం మహారాజ్‌గంజ్‌లో ప్రత్యేక నిఘా ఉంచారు.
నిన్న (బుధవారం) రాజస్థాన్ రాయల్స్తో ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఒకానొక సమయంలో ఆర్సీబీ గెలుస్తుందని అభిమానులు అనుకున్నప్పటికీ.. చివరికి రాజస్థాన్దే పై చేయి అయింది. సిరాజ్ వేసిన బౌలింగ్లో కీలక రెండు వికెట్లు తీసి మ్యాచ్ను ఆర్సీబీ వైపు తిప్పాడు. దీంతో.. ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ గెలుస్తుందని అనుకున్నారు.
చెన్నై సూపర్‌కింగ్స్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ ఎంఎస్ ధోనికి ఐపీఎల్ 2024 సీజనే చివరిదని చాలా వార్తలు వస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ధోని తన చివరి మ్యాచ్‌ను ఆర్సీబీతోనేనని అనేక నివేదికలు పేర్కొన్నాయి. అయితే.. ఆర్సీబీతో మ్యాచ్ తర్వాత, ధోని రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా.. ఐపీఎల్ 2024లో చివరి మ్యాచ్ అయిపోగానే మరుసటి రోజు ధోనీ రాంచీకి వెళ్లాడు. ఇదిలా ఉంటే.. ధోనీ రిటైర్మెంట్‌పై చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ బిగ్ అప్…
భారత క్రికెట్‌లో ధోనీ శకం ప్రారంభమైన సంవత్సరం 2007. MS ధోని సారథ్యంలో టీమిండియా 2007 టీ20 ప్రపంచ కప్‌ను ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఓడించి గెలుచుకుంది. ఆ సమయంలో భారత్ ఈ టోర్నీలో యువ జట్టుతో అడుగుపెట్టింది. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే వంటి స్టార్ ఆటగాళ్లు లేకుండానే ఈ టోర్నీలో విజయం సాధించింది. స్టార్ ఆటగాళ్లు లేకుండా.. భారత్ ఛాంపియన్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ ధోని సారథ్యంలోని యువ భారత జట్టు ఫైనల్లో పాకిస్థాన్‌ను 5…