దేశంలో ఐదో దశ పోలింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో.. ఓ వార్త కలవరపెడుతుంది. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో నలుగురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి. కేంద్ర ఏజెన్సీల నుండి వచ్చిన ఇన్‌పుట్‌ల ఆధారంగా గుజరాత్ ఏటిఎస్ (ATS) ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు పట్టుబడ్డారు. ఈ నలుగురు ఉగ్రవాదులకు ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలున్నట్లు భావిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. జూన్ 3 వరకు రిమాండ్ ను పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల మే 20 వరకు పొడిగించిన రిమాండ్ గడువు నేటితో ముగిసింది. ఇప్పటికే లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన కవిత.. తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవితను వర్చువల్ గా రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ఈ…
ఐపీఎల్ 2024లో భాగంగా.. కోల్కతా నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ అప్పటి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఈ క్రమంలో.. రాత్రి 10.30 గంటల వరకు వేచి చూశారు. ఒకానొక సమయంలో వర్షం కురవడం ఆగిన తర్వాత గ్రౌండ్ మొత్తాన్ని గ్రౌండ్ సిబ్బంది రెడీ చేశారు. దీంతో.. అంఫైర్లు కూడా మ్యాచ్ జరిపించేందుకు సిద్ధం చేశారు. కాగా.. ఈ క్రమంలో.. అంఫైర్లు టాస్ వేయించగా, కేకేఆర్ టాస్…
ఐపీఎల్ 2024లో భాగంగా.. కోల్కతా నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. గుహవాటిలోని బర్సాపరా స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కావాల్సింది. కానీ.. వర్షం పడటంతో ఆలస్యమైంది. దీంతో.. మ్యాచ్ ను 7 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన కేకేఆర్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కాగా.. రాత్రి 10.45 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. ఈ మ్యాచ్ లో టైమ్ ఔట్స్ ఏమీ లేవు. ఇదిలా ఉంటే.. నలుగురు బౌలర్లు బౌలింగ్ చేయాలి. ఒక్కో…
దేశంలో రేపు (సోమవారం) లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్ జరుగనుంది. అందుకోసం ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎనిమిది రాష్ట్రాల్లోని 49 స్థానాలకు ఓటింగ్ జరుగనుంది. ఉత్తరప్రదేశ్‌లోని 14, మహారాష్ట్రలోని 13 స్థానాల్లో అత్యధికంగా ఓటింగ్ జరుగుతోంది. ఒడిశాలో 5, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 3, జమ్మూకశ్మీర్‌లో ఒకటి, లడఖ్‌లో ఒక స్థానానికి పోలింగ్ జరుగుతోంది.
సమాజంలో రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. నిందితులకు కఠినశిక్షలు విధిస్తున్నప్పటికీ కామాంధులు ఆగడం లేదు. తాజాగా.. జార్ఖండ్ రాష్ట్రంలో ఓ అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. చక్రధరపూర్‌లో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు తన ఉపాధ్యాయ పదవికి, సామాజిక, కుటుంబ సంబంధాలకు మచ్చ తెచ్చాడు. 65 ఏళ్ల రిటైర్డ్ టీచర్ తన సొంత మైనర్ మేనకోడలిపై కామ కోరికలు తీర్చుకుని ఎనిమిది నెలల గర్భవతిని చేశాడు. కాగా.. ఈ వ్యవహారం ప్రజలకు తెలవడంతో తీవ్ర ఆగ్రహానికి గురై నిందితుడు రిటైర్డ్ టీచర్‌కు చెప్పుల దండలు…
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఉత్తమ్ నగర్ ప్రాంతంలోని శివ్ విహార్‌లో డ్రగ్స్ దందా చేస్తున్న ముఠా శనివారం రాత్రి ఓ యువకుడిని కిరాతకంగా కొట్టి చంపారు. అంతకు ముందు యువకుడిని చిత్రహింసలు పెట్టారు. అతని ప్రైవేట్ భాగాలను బైక్‌తో తొక్కించి.. కారం చల్లారు. ఆ యువకుడు నొప్పితో కేకలు వేస్తుండటంతో చేతులు, కాళ్లు కట్టి నోటిలో మూత్ర విసర్జన చేశారు నిందితులు. ఈ క్రూర ఘటన ఓ వీధిలో జరిగింది. అయితే.. ఆ యువకుడిని రక్షించడానికి ఎవరూ ప్రయత్నించలేదు. యువకుడు…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రెండో మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్-కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరుగనుంది. గుహవాటిలోని బర్సాపరా స్టేడియంలో ఈ మ్యాచ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సింది. కానీ.. అక్కడ వర్షం పడుతుండటంతో ఇంకా టాస్ కూడా వేయలేదు. కాగా.. పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు. టాస్కు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ రాజస్థాన్కు అత్యంత కీలకం. ఎందుకంటే.. రాజస్థాన్ ఇప్పటి వరకూ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగగా.. ఇప్పుడు మూడవ స్థానానికి పడిపోయారు. పంజాబ్ కింగ్స్తో జరిగిన…
ఐపీఎల్ 2024లో భాగంగా.. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 214 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే పూర్తి చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ షేక్ ఆడించాడు. 28 బంతుల్లో 66 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్ లో 6 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత.. క్లాసెన్ (42) పరుగులు చేశాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి (37), రాహుల్ త్రిపాఠి (33)…
మార్నింగ్ వాక్ వెళ్లిన వ్యక్తిపై ఎద్దు దాడికి పాల్పడింది. ఈ ఘటనలో కాన్పూర్ జిల్లా డిప్యూటీ జడ్జి మృతి చెందారు. ఆదివారం ఉదయం కళ్యాణ్‌పూర్‌లో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఎద్దు పలుమార్లు దాడికి పాల్పడింది. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే.. బాటసారులు అతన్ని ఎలాగోలా ఎద్దు బారినుంచి తప్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా.. అక్కడికి తీసుకెళ్లిన వెంటనే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.