ఫ్రొఫెసర్ల వేధింపులతో ఓ జూనియర్ డాక్టర్ నిండు ప్రాణాలను బలితీసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్న జూనియర్ డాక్టర్ దివేష్ గార్గ్ హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. ఒక ప్రొఫెసర్ తన కొడుకు థీసిస్‌ను రెండుసార్లు తిరస్కరించాడని.. ప్రొఫెసర్లు నిరంతరం వేధింపులకు పాల్పడటంతోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
టీమిండియా కోచ్ పదవిని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తిరస్కరించాడు. అందుకు గల కారణాలను ఆయన వెల్లడించాడు. నేషనల్ టీమ్‌తో కలిసి సీనియర్ కోచ్‌గా పని చేయాలని ఆసక్తి ఉందని చెప్పాడు.. కానీ ఓ కారణంతో బీసీసీఐ ఆఫర్‌కు నో చెప్పినట్లు రికీ పాంటింగ్ తెలిపాడు. భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు అందుకున్న తర్వాత తన ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపలేమో అన్న ఆలోచనతో కోచ్ పదవిని తిరస్కరించానని చెప్పాడు. ద్రవిడ్‌ను కోచ్‌గా కొనసాగమని బీసీసీఐ కోరినప్పటికీ అతను కూడా అదే…
దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల వర్షాలు పడి వాతావరణం చల్లబడితే, మరికొన్ని చోట్ల మాత్రం తీవ్రమైన ఎండలు, వడగాల్పులతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో ఎండలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే.. ఓ మహిళ ఎండలు ఎంతలా ఉన్నాయి అనే దానికి ఏం చేసిందో చూస్తే అవాక్కైతారు.
బ్యాగ్‌లు అమ్మే నెపంతో ఓ ఇంట్లోకి నిశ్శబ్దంగా లోపలికి ప్రవేశించిన దొంగ.. చిన్నారిని చంకలో పెట్టుకుని పారిపోయాడు. స్థానికులు అతని కోసం వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని రుద్రనగర్ లో చోటు చేసుకుంది. ఈ విషయంపై చిన్నారి తల్లి షీలా బధోయ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాము కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని తెలిపింది.
ఐపీఎల్ 2024 క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్.. ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన ఓపెనర్లు పెద్దగా పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి క్రీజులోకి వచ్చి జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో కేకేఆర్ ఫైనల్ కు దూసుకెళ్లింది. 160 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా.. 13.4 ఓవర్లలో 164 పరుగులు చేసింది. కోల్కతా బ్యాటింగ్ లో శ్రేయాస్ అయ్యర్ (58*) వెంకటేష్ అయ్యర్ (51*) పరుగులతో చెలరేగారు. అంతకుముందు ఓపెనర్లు రహ్మతుల్లా గుర్బాజ్ (23), సునీల్ నరైన్ (21) పరుగులతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లు పరుగులు కట్టడి చేయడంలో విఫలమయ్యారు. కేవలం కమిన్స్,…
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం రణరంగాన్ని తలపిస్తుంది. మేదినీపూర్‌లో బీజేపీ నాయకుడు, నటుడు మిథున్ చక్రవర్తి రోడ్ షో నిర్వహిస్తుండగా.. సీసాలు, రాళ్లు విసిరారు. ఈ ఘటనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే పోలీసులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా.. బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్‌కు మద్దతుగా రోడ్‌షో చేసేందుకు మిథున్ అక్కడికి చేరుకున్నారు. మిథున్ రోడ్ షో మేదినీపూర్‌లోని కెరానిటాలా ప్రాంతానికి చేరుకోగానే తృణమూల్ కార్యకర్తలు రోడ్డు పక్కన బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా.. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం…
ఐపీఎల్ 2024లో భాగంగా.. కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు తడబడ్డారు. 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయ్యారు. కేకేఆర్ ముందు 160 పరుగుల ఫైటింగ్ స్కోరును ఉంచారు.
రాజస్థాన్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఫోన్ ఎక్కువగా వాడుతుందని కూతురిని తల్లి రాడ్తో కొట్టి చంపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. 22 ఏళ్ల నికితా సింగ్, బిందాయక ప్రాంతంలో నివాసం ఉంటోంది. అయితే.. ఆమె పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంది. అయితే చదువుకోవడం మానేసి నికితా ఎక్కువ సమయం ఫోన్‌లో గడిపేదని, అందుకే ఆమె ఫోన్ ను రెండున్నర నెలల క్రితం తీసుకున్నట్లు ఆమె తండ్రి తెలిపారు.
వైద్య రంగంలో అరుదైన ఘనత లభించింది. న్యూరో సర్జన్ల బృందం 44 ఏళ్ల మహిళకు ఇన్సులర్ బ్రెయిన్ ట్యూమర్‌ను ట్రాన్స్‌ఫార్మేటివ్, నావెల్ ఐబ్రో కీహోల్ విధానం ద్వారా తొలగించారు. "ఈ అపూర్వమైన ప్రయత్నం ప్రపంచంలోనే మొట్టమొదటిది, న్యూరో-ఆంకాలజీ రంగంలో ఒక ముఖ్యమైన పురోగతిని సూచిస్తుంది" అని చెన్నైలోని అపోలో క్యాన్సర్ సెంటర్స్ (ACCలు) ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు.