ఆదివారం (రేపు) ఐపీఎల్ 2024 ఫైనల్ సమరం జరగబోతుంది. శుక్రవారం రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచి ఫైనల్లోకి దూసుకొచ్చింది. ఇక.. క్వాలిఫైయర్-1 మ్యాచ్లో ఇదే సన్ రైజర్స్పై కోల్కతా నైట్రైడర్స్ గెలిచి ఫైనల్లోకి వెళ్లింది. ఈ క్రమంలో.. రేపు (మే 26) జరుగనుంది. ఈ తరుణంలో ఈ తుదిపోరులో పోటీ పడే సన్‍రైజర్స్ హైదరాబాద్, కోల్‍కతా నైట్‍రైడర్స్ కెప్టెన్లు ఐపీఎల్ ట్రోఫీతో ఫొటో షూట్ చేశారు. చెన్నైలోని మెరీనా బీచ్‍లో ఇద్దరూ కెప్టెన్లు ఐపీఎల్ ట్రోఫీ పట్టుకుని కెమెరాలకు ఫోజులు…
త్వరలో భారత్ మార్కెట్లోకి స్కోడా 3 కొత్త మోడళ్లతో కార్లను విడుదల చేస్తుంది. అందులో ఒక EV కూడా ఉంది. ఇదిలా ఉంటే.. స్కోడా ఆటో ఇండియా, కుషాక్ మరియు స్లావియాతో సహా.. ఇండియా 2.0 ప్రోగ్రామ్ కార్లతో పోలిస్తే అమ్మకాల గణాంకాల పరంగా మంచి పనితీరును కొనసాగిస్తోంది. అయితే.. చెక్ కార్ల తయారీ సంస్థ భవిష్యత్తులో కొత్త కార్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. భారతదేశానికి రానున్న స్కోడా 3 కొత్త మోడళ్ల కార్ల గురించి తెలుసుకుందాం.
జేఎన్టీయూ కొత్త ఇంఛార్జ్ వైస్ ఛాన్సలర్గా నియమితులైన బుర్రా వెంకటేశం నేడు జేఎన్టీయూని సందర్శించారు. వైస్ ఛాన్సలర్ ఛాంబర్ లో డైరెక్టర్ కె. విజయకుమార్ రెడ్డి, రిజిస్టార్ కె. వేంకటేశ్వరావుల సమక్షంలో యూనివర్సిటీలోని డైరెక్టర్లను, కాలేజ్ ప్రిన్సిపాల్, క్యాంపస్ కాలేజీలోని పలు డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న ఆచార్య వర్గాన్ని, ఆయా డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలు, ఇంచార్జ్ వైస్ ఛాన్స్లర్కు రిజిస్టార్ పరిచయం చేశారు.
కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుల్గామ్ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న టూరిస్ట్ వాహనం ఒక్కసారిగా లోయలో జారి పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కుల్గాం జిల్లాలోని నిపోరా ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు పంజాబ్ వాసులు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్. 12 లోని మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారు. సీఎం అయిన తరువాత తొలిసారి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కార్యాలయానికి చేరుకోగానే సీఎం రేవంత్ రెడ్డికి సీఎస్ శాంతకుమారి, తెలంగాణ డీజీపీ రవి గుప్తా, హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పలువురు ఉన్నతధికారులు స్వాగతం పలికారు. అనంతరం సైబర్ సెక్యూరిటీ వింగ్, డ్రగ్స్ కంట్రోల్ వింగ్ సెంటర్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.
హైదరాబాద్ బషీర్ బాగ్లోని సీసీఎస్ ముందు సాహితి ఇన్ ఫ్రా కంపెనీ బాధితులు ఆందోళనకు దిగారు. ఫ్రీలాంఛ్ పేరిట 2500 మందిని మోసం చేశారంటూ బాధితులు నిరసన చేపట్టారు. శర్వాణి ఎలైట్ పేరుతో 10 టవర్లు నిర్మిస్తామంటూ రూ.1500 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ రావు అరెస్ట్ తో బాధితులు బయటకొస్తున్నారు. ఉమామహేశ్వరరావు తమను వేధింపులకు గురి చేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కేసు విచారణ వేగవంతం చేయాలని సాహితి ఇన్ ఫ్రా కంపెనీ బాధితులు…
నకిలీ డాక్టర్లపై తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి చర్యలు తీసుకుంటుంది. ఎలాంటి అర్హత లేకుండానే చాలా మంది వైద్యులుగా చలామణి అవుతున్నారు. ఈ క్రమంలో.. హైదరాబాద్లోని ఐడీపీఎల్, చింతల్, షాపూర్‌నగర్ (IDPL, Chintal, Shapurnagar) ప్రాంతాల్లో నకిలీ క్లినిక్ లపై అధికారులు సోదాలు జరిపారు. ఈ తనిఖీల్లో 50 మంది నకిలీ వైద్యులను గుర్తించారు.
నాగర్ కర్నూల్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజు రోజుకు అడుగంటి పోతున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్త శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో బాధతో మాట్లాడుతున్నామని తెలిపారు. పది రోజుల ముందే డీజీపీకి నాగర్ కర్నూల్ లో ఉన్న పరిస్థితులు వివరించామన్నారు. అయినా ఈ హత్య జరిగింది.. రాయలసీమ ఫ్యాక్షనిజం లాంటి పరిస్థితులు వచ్చాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు శ్రీధర్ రెడ్డి హత్యలో ఒక్కర్ని కూడా అదుపులోకి…
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడింది. పోలింగ్ ముగిసే వరకు 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్ ఉండనుంది. కాగా.. ఎల్లుండి (సోమవారం) పోలింగ్కు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి ఉ.8 గంటల నుండి సా.4 వరకు పోలింగ్ జరుగనుంది. అందుకోసం 605 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయగా.. మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా.. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోరులో 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
తెలంగాణలో 2024-25 స్కూల్స్ అకాడమిక్ క్యాలెండర్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జూన్ 12 నుండి స్కూళ్లు ఓపెన్ చేయనున్నారు... 23 ఏప్రిల్ 2025 వరకు మొత్తం 229 పనిదినాలు ఉండనున్నాయి. కాగా.. జూన్ 1 నుండి 11 వరకు బడి బాట కార్యక్రమం జరుగనుంది. 2024 జూన్ 12న ప్రారంభమై 2025 ఏప్రిల్ 23తో ముగుస్తాయి. 2025 ఏప్రిల్ 24 నుంచి 2025 జూన్ 11 వరకు మొత్తం 49 రోజులు ఈ విద్యాసంవత్సరంలో వేసవి సెలవులు ఉంటాయి. అలాగే.. అక్టోబర్ 2…