ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో కేకేఆర్ ఫైనల్ కు దూసుకెళ్లింది. 160 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా.. 13.4 ఓవర్లలో 164 పరుగులు చేసింది. 38 బంతులు ఉండగానే లక్ష్యాన్ని చేధించారు. కోల్కతా బ్యాటింగ్ లో శ్రేయాస్ అయ్యర్ (58*) వెంకటేష్ అయ్యర్ (51*) పరుగులతో చెలరేగారు. అంతకుముందు ఓపెనర్లు రహ్మతుల్లా గుర్బాజ్ (23), సునీల్ నరైన్ (21) పరుగులతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లు పరుగులు కట్టడి చేయడంలో విఫలమయ్యారు. కేవలం కమిన్స్, నటరాజన్ తప్ప మిగత వాళ్లు వికెట్ తీయలేకపోయారు.
Read Also: Telangana: తెలంగాణ జూనియర్ డాక్టర్స్ సమ్మె వాయిదా.. డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన అధికారులు
మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు ట్రేవిస్ హెడ్ గోల్డెన్ డక్ కాగా.. అభిషేక్ శర్మ (3) పరుగులు చేశాడు. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి (55), నితీష్ కుమార్ రెడ్డి (9), క్లాసెన్ (32) పరుగులు చేశారు. అబ్దుల్ సమద్ (16), సన్వీర్ సింగ్ డకౌట్, కమిన్స్ (30), విజయకాంత్ వియస్కాంత్ (7) పరుగులు చేశారు. సన్ రైజర్స్ బ్యాటర్లలో నలుగురు బ్యాట్స్మెన్లు డకౌట్ అయ్యారు. కోల్కతా బౌలింగ్లో మిచెల్ స్టార్ మొదట్లోనే హెడ్ వికెట్ తీసి సన్ రైజర్స్ ను దెబ్బ తీశాడు. అతని బౌలింగ్లో 3 కీలక వికెట్లు సంపాదించాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు పడగొట్టగా.. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, రస్సెల్ తలో వికెట్ సాధించారు.
Read Also: US: ఇరాన్ అధ్యక్షుడి మృతి వెనుక కుట్ర లేదు