నిన్న (బుధవారం) రాజస్థాన్ రాయల్స్తో ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఒకానొక సమయంలో ఆర్సీబీ గెలుస్తుందని అభిమానులు అనుకున్నప్పటికీ.. చివరికి రాజస్థాన్దే పై చేయి అయింది. సిరాజ్ వేసిన బౌలింగ్లో కీలక రెండు వికెట్లు తీసి మ్యాచ్ను ఆర్సీబీ వైపు తిప్పాడు. దీంతో.. ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ గెలుస్తుందని అనుకున్నారు.
Read Also: Ebrahim Raisi Last Journey: ముగిసిన ఇరాన్ అధ్యక్షుడి అంత్యక్రియలు..
అంతకుముందు యష్ దయాల్ వేసిన 17 ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు ఇచ్చాడు. దీంతో కోహ్లీకి పట్టరాని కోపం వచ్చింది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ మండిపడ్డారు. అంతేకాకుండా.. కూల్ డ్రింక్ బాటిల్ను విసిరికొట్టారు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సీజన్లో అత్యంత పరుగులు చేసిన క్రికెటర్గా విరాట్ కోహ్లీ ఉన్నాడు.
Read Also: Ambati Rambabu Petition: మంత్రి అంబటి రాంబాబు పిటిషన్ ను కొట్టేసిన ఏపీ హైకోర్టు..
అంతేకాకుండా.. కోహ్లీ ఫీల్డింగ్లోనూ చురుకుగా ఉంటాడు. ఎన్నో అద్భుతమైన క్యాచ్లు, రనౌట్లు చేస్తూ ఉంటాడు. అయితే.. ఈసారైనా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్ చేజిక్కుంచుకోకపోవడంపై ఆటగాళ్లతో పాటు.. అభిమానులు కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. విరాట్ కోహ్లి ఈ సీజన్ లో 15 టీ20ల్లో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలతో సహా 741 పరుగులు సాధించాడు.
https://twitter.com/SergioCSKK/status/1793546433280586007