Drunk Soldier: తాగిన మత్తులో మహిళ బెర్త్పై సోల్జర్ మూత్ర విసర్జన..
- తాగిన మత్తులో మహిళ బెర్త్పై సోల్జర్ మూత్ర విసర్జన
- నిజాముద్దీన్ స్టేషన్ నుంచి దుర్గ్‌కు వెళ్తున్న గోండ్వానా ఎక్స్‌ప్రెస్‌లో ఘటన
- ఫిర్యాదు చేసినా ఆర్పీఎఫ్ సిబ్బంది పట్టించుకోలేదని ఆరోపణ
- ప్రధానమంత్రి కార్యాలయం.. రైల్వే మంత్రికి ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాగిన మత్తులో ఓ సైనికుడు రైలులో ప్రయాణిస్తుండగా.. తన బెర్త్ పై మూత్ర విసర్జన చేశాడని, నిద్రిస్తున్న సమయంలో అది తనపై పడిందని ఓ మహిళ ఆరోపించింది. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌కు వెళ్తున్న గోండ్వానా ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది. రైలు గ్వాలియర్ చేరుకుంటుందనగా ఈ ఘటన జరిగిందని బాధిత మహిళ తెలిపింది. ఈ విషయమై ఆమె రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)కు ఫిర్యాదు చేస్తే వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) మరియు రైల్వే మంత్రికి ఫిర్యాదు చేసింది. ఆమె రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తన కుమారుడు, భర్త ఉన్నారని.. బీ-9 కోచ్‌లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగిందని బాధిత మహిళ పేర్కొంది.
Read Also: Delhi water crisis: నీటిని విడుదల చేయాలని హర్యానా సర్కార్‌కు ఆప్ విజ్ఞప్తి
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
సైనికుడికి పై బెర్త్ కేటాయించగా, మహిళకు లోయర్ బెర్త్ కేటాయించారు. సైనికుడు పూర్తిగా మత్తులో ఉన్నాడని, అతని బెర్త్‌పై అపస్మారక స్థితిలో పడుకున్నాడని.. పై బెర్త్‌పై మూత్ర విసర్జన చేశాడని బాధిత మహిళ ఆరోపించింది. ఘటన జరిగిన వెంటనే బాధితురాలు తన భర్తకు సమాచారం అందించడంతో రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కి ఫిర్యాదు చేశాడు. గ్వాలియర్, ఝాన్సీ స్టేషన్లలో ఆర్పీఎఫ్ సిబ్బంది ఫిర్యాదు చేసినప్పటికీ.. ఫోటోలు తీసి, ఎటువంటి చర్య తీసుకోకుండా వెళ్లిపోయారు. మరోవైపు.. ఆర్‌పిఎఫ్ ఇన్‌ఛార్జ్ అధికారి సంజయ్ ఆర్య ఈ సంఘటనను అంగీకరించారు. సైనికుడు మత్తులో ఉన్నాడని.. అతని ప్యాంటు తడిగా ఉందని ధృవీకరించారు. అయితే B-9 కోచ్‌లోని సీట్ నంబర్ 23లో మహిళా కనిపించలేదని పేర్కొన్నారు.
Read Also: Maharaja OTT : ‘మహారాజ’ ఓటీటీ అప్డేట్ వచ్చేసింది..?
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!