Team India: శ్రీలంక చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టిన టీమిండియా.. వీడియో
- మూడు టీ20ల అంతర్జాతీయ సిరీస్ కోసం శ్రీలంక చేరుకున్న టీమిండియా
- జూలై 22న శ్రీలంకకు చేరుకున్న భారత జట్టు
- ఈరోజు నుంచి ప్రాక్టీస్ సెషన్‌లను ప్రారంభించిన టీమిండియా
- టీమిండియా కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కి ఇది మొదటి అసైన్‌మెంట్
- టీ20 కెప్టెన్‌గా పూర్తి బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్కు మొదటి టూర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడు టీ20ల అంతర్జాతీయ సిరీస్ కోసం టీమిండియా శ్రీలంక చేరుకుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు జూలై 22న శ్రీలంకకు చేరుకుంది. ఈ క్రమంలో.. ఈరోజు నుంచి భారత జట్టు ప్రాక్టీస్ సెషన్‌లను ప్రారంభించింది. ఇదిలా ఉంటే.. టీమిండియా కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కి ఇది మొదటి అసైన్‌మెంట్. అలాగే.. టీ20 కెప్టెన్‌గా పూర్తి బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్కు కూడా ఇది మొదటి టూర్. టీమ్ ఇండియా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.. అనంతరం.. రవీంద్ర జడేజాతో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 ఇంటర్నేషనల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. కాగా.. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే శ్రీలంక పర్యటనకు భారత జట్టును ప్రకటించగానే.. కెప్టెన్సీని సూర్యకుమార్ యాదవ్‌కు అప్పగించారు. వాస్తవానికి. హార్దిక్ పాండ్యా గాయం కారణంగా చాలా కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అందువల్ల సూర్యనే కెప్టెన్సీకి ఉత్తమ ఎంపికగా భావించారు.
Read Also: Italy: మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం విస్ఫోటనం.. ఎయిర్‌పోర్టు మూసివేత
Also Read
ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచ కప్ తర్వాత, టీమిండియా ఐదు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ ఆడేందుకు జింబాబ్వేకు వెళ్లింది. ఆ పర్యటనలో జట్టులోని చాలా మంది సీనియర్ ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చారు. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో జింబాబ్వేలో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 4-1తో కైవసం చేసుకుంది. భారత్ వర్సెస్ శ్రీలంక టీ20 ఇంటర్నేషనల్ సిరీస్.. జూలై 27 నుండి జూలై 30 వరకు పల్లెకెలెలో జరగనుంది. ఈ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు జూలై 27, 28 తేదీల్లో జరగనుండగా.. చివరి మ్యాచ్ జూలై 30న జరగనుంది. ఆ తర్వాత భారత్-శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కూడా జరగనుంది.
𝗛𝗲𝗮𝗱 𝗖𝗼𝗮𝗰𝗵 𝗚𝗮𝘂𝘁𝗮𝗺 𝗚𝗮𝗺𝗯𝗵𝗶𝗿 𝗧𝗮𝗸𝗲𝘀 𝗖𝗵𝗮𝗿𝗴𝗲! 💪#TeamIndia | #SLvIND | @GautamGambhir pic.twitter.com/sbG7VLfXGc
— BCCI (@BCCI) July 23, 2024
- Tags
- practice
- Sri Lanka
- Team India
- Video
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు