గుర్తు తెలియని మహిళ పుర్రె లభ్యమైన సంఘటన మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అత్వెల్లి గ్రామంలోని నార్నే ఎస్టేట్లో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి పుర్రె, వెంట్రుకలు, చీర, బ్లౌజ్, చేతి సంచి, ఒక చెప్పు కనపడింది. దీంతో వెంటనే స్థానిక మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మేడ్చల్ సీఐ అద్దాని సత్యనారాయణ, సబ్ ఇన్స్పెక్టర్ మురళీధర్ లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
Read Also: Abhinav Bindra: గోల్డ్ మెడల్ విన్నర్ కు అరుదైన గౌరవం.. ‘ఒలింపిక్ ఆర్డర్ అవార్డు’..
అనంతరం నగరంలోని గాంధీ ఆస్పత్రి నుంచి ఫోరెన్సిక్ ప్రొఫెసర్ కె.వి నాగరాజుతో పాటు 5 మంది సిబ్బందితో కలిసి ఆధారాలు సేకరించారు. అనంతరం ఫోరెన్సిక్ ప్రొఫెసర్ కె.వి నాగరాజు మాట్లాడుతూ.. గత ఆరు నెలలకు ముందే ఈ హత్య జరిగి ఉండొచ్చని ఆయన తెలిపినట్లు ఎస్సై మురళీధర్ పేర్కొన్నారు. ఎవరైనా గుర్తిస్తే వెంటనే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని సీఐ తెలిపారు.
Read Also: AP Assembly sessions: రేపు అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులు..