ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) రాష్ట్రంలో ఆయుష్ సేవల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మున్నెన్నడూ లేనివిధంగా రూ.90 కోట్ల 84 లక్షలు నిధులు అందించడానికి సమ్మతి తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఆయుష్ విభాగానికి సమాచారం అందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారం వెల్లడించారు. 2019-24 కాలంలో ఆయుష్ విభాగానికి కేవలం రూ. 38 కోట్లు మాత్రమే కేంద్ర నిధులు లభించగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తమ విజ్ఞప్తి మేరకు కేంద్ర సాయాన్ని భారీగా పెంచడానికి మోదీ ప్రభుత్వం అంగీకరించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ సంవత్సం జూలై నెలలో కేంద్ర ఆయుష్ శాఖా మంత్రి, ఉన్నతాధికారుల్ని కలిసి గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఆయుష్ కార్యక్రమాలు నిర్లక్ష్యానికి గురైన తీరును వివరించి, వాటి అభివృద్ధికి తగు మేరకు కేంద్ర నిధుల్ని అందించాలని కోరినట్లు మంత్రి తెలిపారు. తమ విజ్ఞప్తిని అంగీకరించినందుకు ఆయన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.
Tollywood Hero: తెలుగు హీరోకి టోకరా.. రూ. 45 లక్షలు కొట్టేసిన కేటుగాళ్ళు
రాష్ట్రంలో ఆయుష్ శాఖను బలోపేతం చేసేందుకు, ఆయుష్ వైద్య శాలల్లో మందుల సరఫరాకు, నిర్మాణ దశలో ఆగిపోయిన 50 పడకల ఆయుష్ ఆసుపత్రుల్ని పూర్తి చేసేందుకు, పాడుబడిన ఆయుష్ డిస్పెన్సరీల పునర్నిర్మాణానికి, వివిధ ఆయుష్ పథకాలకు, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆయుష్ కళాశాలలు మరియు ఆసుపత్రులను మెరుగుపర్చేందుకు, నూతన ప్రభుత్వ ప్రకృతి వైద్య కళాశాల నిర్మాణానికి మరియు రాష్ట్రంలోని 126 ఆయష్మాన్ ఆరోగ్య మందిరాలను పటిష్టం చేసేందుకు కేంద్ర సాయాన్ని కోరినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు.
Israel: ఇజ్రాయిల్ ఎలైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ ‘‘యూనిట్ 8200’’ చీఫ్ రాజీనామా.. కారణం ఇదే..
రాష్ట్రంలోని 90 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్ని ఎన్ఎబిహెచ్ గుర్తింపు కోసం పంపగా.. 89 కేంద్రాలకు మంజూరు లభించినట్లు మంత్రి తెలిపారు. ఇతర రాష్ట్రాలలో ప్రభుత్వ ఆయుష్ కళాశాలలు ఎక్కువ సంఖ్యలో ఉండగా, మన రాష్ట్రంలో కేవలం ఒక్క ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ఉన్నందున మరో కళాశాల నిర్మాణానికి కేంద్ర సాయాన్ని కోరగా, సానుకూల స్పందన లభించినట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు ధర్మవరంలో నూతన ఆయుర్వేద కళాశాలను, దాని అనుబంధ 100 పడకల ఆసుపత్రిని నిర్మించే ఆలోచన చేసినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రానికి ఆయుర్వేద కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరానికి అదనంగా యూజీ మరియు పిజి సీట్ల కేటాయింపు కోరగా కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు. కేంద్రం హామీ మేరకు విశాఖపట్నంలో 50 పడకల ఆయుష్ ఆసుపత్రికి రూ.8.50 కోట్లు, కాకినాడలోని ఆసుపత్రికి రూ.8 కోట్లు, ఆరోగ్య మందిరాలకు రూ.5.75 కోట్లు, ఆయుష్ కళాశాలలకు రూ. 20 కోట్లు కేంద్ర నిధులు లభించనున్నట్లు మంత్రి వివరించారు. సిబ్బంది శిక్షణ కోసం అదనంగా మరో 10 కోట్లు కావాలని కేంద్రాన్ని కోరామన్నారు.