మాజీ సీఎం జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏలేరు రిజర్వాయర్కు అంత పెద్దమొత్తంలో వరద వచ్చినా ప్రాణ నష్టం జరగలేదంటే ప్రభుత్వ అప్రమత్తతే కారణమని మంత్రి పేర్కొన్నారు. 114 చోట్ల కట్ట బలహీనతలు గుర్తించి పటిష్టపరిచి ఆస్తి నష్టాన్ని తగ్గించామని తెలిపారు. ఏలేరు రిజర్వాయర్ గురించి మాట్లాడే స్థాయి జగన్ కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూసెక్కులకు, టీఎంసీలకు, వాగుకి నదికి తేడా తెలియని వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఈ నెల 4 నుంచే కలెక్టర్, జలవనరులు అధికారులు పెరుగుతున్న ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పూర్తి అప్రమత్తంగా ఉన్నారని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా చేసిన నిర్లక్ష్యం వల్లే అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది.. శవాలు కనిపిస్తే జగన్ కు ఆనందం, కష్టపడి ఏలేరు వెళ్లినా శవాలు కనిపించకపోవటంతో దిగులు చెంది ప్రభుత్వం పై విమర్శలు చేశాడని మంత్రి తెలిపారు.
Read Also: Teacher: 16 ఏళ్ల స్టూడెంట్‌తో లేడీ టీచర్ శృంగారం.. తండ్రికి తెలిసినా..
జగన్ విధ్వంసానికి ఏలేరు రిజర్వాయర్ కూడా బలైందని మంత్రి నిమ్మల వ్యాఖ్యానించారు. 2007లో వైఎస్ పరిపాలన అనుమతులు ఇచ్చారు కానీ.. రూపాయి ఖర్చు చేయలేదన్నారు. 2014-19మధ్య రూ.93 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం ఏలేరు ఆధునికీకరణ కు ఖర్చు చేసిందని తెలిపారు. 2019-24మధ్య ఏం ఖర్చు చేశాడో జగన్ చెప్పగలడా..? మంత్రి నిమ్మల ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వం రూ.20 వేలు ఇచ్చిన ఇన్ఫుట్ సబ్సిడీని రూ.16 వేలకు తగ్గించింది జగన్ కాదా అని దుయ్యబట్టారు. జగన్ తగ్గించిన ఇన్పుట్ సబ్సిడీని చంద్రబాబు రూ.25 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.. ఇన్పుట్ సబ్సిడీ పై జగన్ సిగ్గులేకుండా ఎలా మాట్లాడతాడని విమర్శించారు. ఏలేరు రిజర్వాయర్ ద్వారా విశాఖకు మంచినీరు, ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు పురుషోత్తపట్నం ద్వారా చంద్రబాబు ప్రత్యామ్నాయాలు రచించారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
Read Also: CM Yogi: యోగి చేతికి గాయం.. రిస్ట్ బ్యాండ్ రహస్యాన్ని బయటపెట్టిన సీఎం