పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో వారం రోజులుగా మతపరమైన అల్లర్లు కొనసాగుతున్నాయి. ఈ అల్లర్లలో ఇప్పటివరకు 37 మంది మరణించారు. సుమారు 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. కుర్రం జిల్లాలో ఇస్లాం మరియు షియా వర్గానికి చెందిన తెగల మధ్య మత ఘర్షణలు తలెత్తాయి. గత కొన్నేళ్లుగా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. జూలైలో ఈ తెగల మధ్య జరిగిన ఘర్షణలో దాదాపు 35 మంది ప్రాణాలు కోల్పోయారు. జిర్గా గిరిజన మండలి పిలుపు మేరకు కాల్పుల విరమణ తర్వాత గొడవలు ముగిశాయి.
Read Also: Rajasthan: పోలీసుల ఎస్కార్ట్‌తో రాజస్థాన్ డిప్యూటీ సీఎం కుమారుడి రీల్ షూట్..
ఈ గొడవలను రాజీ ద్వారా ముగించేందుకు స్థానిక అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. భద్రతా బలగాలు, స్థానిక ప్రజలు రాజీ కోసం అనేక ప్రయత్నాలు చేశారు. అయితే భారీ ఆయుధాలతో ఇంకా 10 ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగుతున్నాయి. కాగా.. ఈ గొడవ మొదట భూ వివాదంగా ప్రారంభమైంది.. ఆ తర్వాత ఆటోమేటిక్ ఆయుధాలు, మోర్టార్ షెల్‌లు, మత హింసతో కూడిన హింసగా మారాయి.ఈ గొడవల్లో 28 ఇళ్ళు దెబ్బతిన్నాయి. చాలా చోట్ల చిన్న చిన్న గొడవలు జరిగాయి.
Read Also: Amit Shah: ఎంఎస్‌పి పూర్తి పేరు తెలుసా..? రాహుల్ గాంధీ టార్గెట్‌గా విమర్శలు
పాకిస్తాన్ జనాభాలో ఎక్కువ మంది సున్నీలు ఉంటారు. అందువల్ల మైనారిటీ షియా ముస్లింలు ఇక్కడ వివక్షను ఎదుర్కోవలసి వస్తుంది. పాకిస్తాన్‌లోని మరో ముస్లిం సమాజమైన అహ్మదీయా కూడా హింసను ఎదుర్కొంటుంది. ఎందుకంటే సున్నీ సంఘం ప్రకారం.. అహ్మదీయ సమాజం ఇస్లాంను అనుసరించలేదు. ఒకరి కమ్యూనిటీ పట్ల మతోన్మాదం కారణంగా పాకిస్తాన్‌లో మతపరమైన అల్లర్లు జరుగుతాయి.